ఫోర్బ్స్ చనిపోయిన జాబితా: నెంబర్ వన్ జాక్సన్
న్యూఢిల్లీ: చనిపోయి ఐదేళ్లు గడిచినా పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ ఆదాయానికి ఢోకా లేదు. ఆయన ఎస్టేట్, ఆల్బమ్‌లతో ఇప్పటికే 141 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మైఖేల్ జాక్సన్ నెంబర్ వన్‌గా నిలిచారు.
దీంతో ఫోర్బ్స్ కీర్తిశేషుల జాబితాలో రెండోసారీ ఆయనే అగ్రస్థానంలో నిలిచారని ఫోర్బ్స్ బుధవారం వెల్లడించింది. రెండో స్థానంలో ఎల్విస్ ప్రెస్లీ ఉన్నారు. 1977లో చనిపోయిన ఆయన పేరు మీద ఇప్పటికీ 55 మిలియన్ డాలర్ల సంపాదన వస్తోంది.

తృతీయ స్థానంలో కార్టూనిస్ట్, పీనట్ కామిక్ సృష్టి కర్త ఛార్లెస్ షుల్జ్ ఉన్నారు. ఆయన పేరిట ఎటా 40 మిలియన్ డాలర్ల సంపాదన సమకూరుతోంది. దీంతో వీరు ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications