వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ రాజుకు సంతాపం: మిషెల్‌పై ట్విట్టర్‌లో విమర్శలు (ఫోటో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులపై ట్విట్టర్‌లో విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి. కారణం సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆయనకు సంతాపం తెలిపే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహిళలు తమ తల భాగం కనిపించకుండా వస్త్రాన్ని ధరించాలి.

ఆ ఆనవాయితీ ఫస్ట్ లేడీ మిషెల్‌కు తెలియదో ఏమో కానీ తల భాగంపై వస్త్రాన్ని ధరించలేదు. దీంతో మిషెల్ ఒబామా తమ సాంప్రదాయాన్ని గౌరవించలేదని ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం గురించి ట్విట్టర్‌లో కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఐతే ఈ సాంప్రదాయంపై విదేశీయులకు మినహాయింపు ఉందని కూడా మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

Michelle Obama forgoes a headscarf and sparks a backlash in Saudi Arabia

ట్విట్టర్‌లో ఇప్పటికే సుమారు 1500 ట్వీట్లు #Michelle_Obama_unveiled ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇండోనేషియా పర్యటనలో మిషెల్ ఒబామా తలపై వస్త్రం ధరించిందని కానీ సౌదీకి వచ్చినప్పుడు అలా చేయలేదని తీవ్రంగా విమర్శిస్తూ ఫోటోలతో సహా ట్వీట్స్ చేస్తున్నారు.

ఇక సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా జనవరి 23 నాడు మరణించిన విషయం తెలిసిందే. భారత్‌కు మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక రోజు మిగిలి ఉండగానే తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని, కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం తెలియజేయడానికి సౌదీ అరేబియా వెళ్లిన విషయం తెలిసిందే.

English summary
Barack Obama was in Riyadh on Tuesday to pay his respects to the late Saudi King Abdullah. His visit, for which he cut short a much-hyped trip to India, underscores how important the U.S.-Saudi relationship remains to the American leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X