వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీకి మరో షాక్, రేసులోకి మిచెల్లి ఒబామా! ట్రంప్‌కు పుతిన్ గ్రీటింగ్స్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవిలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో జరిగిన హోరోహోరీ పోరులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అమెరికా దేశ చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని హిల్లరీ ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు.

అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికలలో మాత్రం బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలు 2020లో జరగనున్నాయి.

michelle obama

ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో హిల్లరీ క్లింటన్‌కు ఆదరణ క్రమేణా తగ్గుతూ రావడం, ప్రచారంలో పాల్గొన్ని మిచెల్లీ ఒబామా చక్కటి ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవడం గమనించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి హిల్లరీని వదిలేసి మిచెల్లీ ఒబామానే తమ భవిష్యత్తుగా భావిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం

వీరంతా ట్విట్టర్లో మిచెల్ 2020 పేరుతో హ్యాష్ టాగ్ కూడా నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ ధోరణి నచ్చని వాళ్లు ఇప్పుడు ఆయన విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విజయం అనంతరం మిచెల్లీ ఒబామాను తెరపైకి తీసుకు వచ్చారు.

ట్రంప్‌కు పుతిన్ శుభాకాంక్షలు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ టెలిగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్ష స్థానం గెలుచుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఉపయోగపడతాయని ఆశించారు. జపాన్ ప్రధాని షింజో అబే తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Michelle Obama is the popular choice to run for president in 2020 after the Donald Trump win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X