వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫుట్‌బాల్‌ గ్రౌండంత రెక్కలు!.. 2 లక్షల కిలోల బరువు.. గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం (వీడియో)

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా : ఏరోస్పేస్ విమానాల తయారీలో ప్రసిద్ధిగాంచిన స్ట్రాటోలాంచ్ తయారుచేసిన అతిపెద్ద విమానం విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ విమానం శనివారం నాడు నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని మొజావే ఎయిర్ పోర్ట్ నుంచి సరిగ్గా ఉదయం 6 గంటల 58 నిమిషాలకు తొలి టేకాఫ్ తీసుకుంది.

హైదరాబాద్‌లో సొరంగ మార్గం.. కొత్త దారుల అన్వేషణ..!హైదరాబాద్‌లో సొరంగ మార్గం.. కొత్త దారుల అన్వేషణ..!

బరువు తెలిస్తే.. రెక్కలు చూస్తే..!

గంటకు 302 కిలోమీటర్ల వేగంతో గగనతలంలో సందడి చేసింది ఈ విమానం. రెండున్నర గంటల సేపు నింగిలో చక్కర్లు కొట్టింది. మొజావే ఎడారి ప్రాంతంలో దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. ఈ విమానం విశేషాలు చూస్తే ఔరా అనాల్సిందే. 385 అడుగుల పొడవు, 238 అడుగుల వెడల్పుతో ఉండే రెక్కలు దీనికి ప్రధాన ఆకర్షణ. దీని రెక్కల కొలతలు దేనికి సమానమంటే.. ఒక సాధారణ ఫుట్‌బాల్‌ గ్రౌండంత. ఇక దాని బరువు వివరాలు తెలిస్తే కంగు తినాల్సిందే. అక్షరాలా 2 లక్షల 26 వేల 800 కిలోల బరువు ఉంటుంది.

తొలి టెస్ట్ ఓకే

తొలి టెస్ట్ ఓకే

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం గాల్లోకి విజయవంతంగా ఎగరడంతో స్ట్రాటోలాంచ్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. వరల్డ్ లోనే అత్యంత బరువున్న అతిపెద్ద విమానం గాల్లోకి ఎగిరి రికార్డు సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తొలి టెస్ట్ సానుకూలంగా జరిగిందని.. ఇది మున్ముందు తమలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.

పాల్ అలెన్ కృషి..!

పాల్ అలెన్ కృషి..!

35 వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగరడం దీని మరో ప్రత్యేకత ఐతే.. 5 లక్షల పౌండ్ల బరువున్న శాటిలైట్లను సైతం నిర్ణీత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టగలిగే కెపాసిటీ దీని సొంతం కావడం విశేషం. దీని రూపకర్త మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్. రాకెట్ల ద్వారా శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు 2011 లో శ్రీకారం చుట్టారు.

English summary
Stratolaunch, the aerospace venture founded by the late Microsoft co-founder Paul Allen, sent the world’s biggest airplane into the air for its first flight test. The twin-fuselage plane, which incorporates parts from two Boeing 747 jumbo jets and has a world-record wingspan of 385 feet, took off from Mojave Air and Space Port in California for a flight that lasted two and a half hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X