వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లింక్డ్‌ఇన్ టేకోవర్: చక్రం తిప్పిన తెలుగోడు సత్య నాదెళ్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం లింక్డ్ ఇన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,70,000 కోట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించేందుకు మైక్రోసాప్ట్ సిద్ధమైంది. ఈ ఏడాదిలోగా లావాదేవీలు పూర్తి కానున్నాయి.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో సాధ్యం కానిది.. ప్రస్తుత సీఈవో, తెలుగు తేజంసత్య నాదెళ్లతో అయింది. ఆయా రంగాలకు చెందిన నిపుణుల మధ్య సంధానకర్తగా లింక్డ్ ఇన్‌ సత్తా చాటుతోంది. దీనిని టేకోవర్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

లింక్డ్ ఇన్‌‌ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ గతంలో చాలాసార్లు ప్రయత్నాలు చేసిందని చెబుతున్నారు. అయితే ఫలితం దక్కలేదు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో టేకోవర్లతో దూసుకెళుతున్న సత్య నాదెళ్ల లింక్డ్ ఇన్‌ను చేజిక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు.

మొదటి నుంచి లింక్డ్ ఇన్‌కు తాను పెద్ద అభిమానిని అని చెప్పుకున్న సత్య నాదెళ్ల, ఆ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో చర్యలు ప్రారంభించారని అంటున్నారు. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా దానిని మైక్రోసాఫ్ట్‌లో విలీనం చేసే పనిని నాదెళ్ల విజయవంతగా ముగించారు.

కాగా, మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో లింక్డ్ ఇన్ షేర్లు దాదాపు 48శాతం పెరిగి 196 డాలర్లకు చేరుకున్నాయి. లింక్డ్ ఇన్ దాని బ్రాండ్‌ను, స్వేచ్ఛను కోల్పోదని, ప్రస్తుత సీఈవో జెఫ్‌ వీనర్‌ కొనసాగుతారని పేర్కొంది. తర్వాత మార్పులలో భాగంగా ఆయన నేరుగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు నివేదిస్తారన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వృత్తి నిపుణులను కలపటంలో లింక్డ్ ఇన్ బృందం విజయం సాధించిందని, ఇప్పుడు తమభాగస్వామ్యం కూడా తోడుకావడంతో లింక్డ్ ఇన్‌ను వేగవంతంగా అభివృద్ధి చేయవచ్చునని సత్య నాదెళ్ల అన్నారు. ఈ డీల్‌ను ఈ సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు.

కాగా, రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక స్యత నాదెళ్ల చేపట్టిన అతిపెద్ద కొనుగోలు ఇదే. ప్రపంచ స్థాయి వృత్తినిపుణుల అనుసంధాన కర్త.. ప్రపంచ స్థాయి నెట్‌వర్క్‌ నాయకుల కలయికగా దీనిని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. నిధుల పరంగా చూసినా.. లింక్డ్ ఇన్‌తో కొనుగోలు పరంగా చూసినా ఇది మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద డీల్.

English summary
San Francisco, June 13 Microsoft on Monday announced to acquire professional networking website LinkedIn for $26.2 billion in an all-cash deal billed as one of the largest such acquisitions in the social media space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X