వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Satya Nadella on caa: బాధ, విషాదం కలుగుతోంది, వలసదారుల్లో టాలెంట్..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతోన్నాయి. సీఏఏను విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తోన్నాయి. అయితే తొలిసారి ఓ ఐటీ దిగ్గజం పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించారు. భారతదేశానికి చెందిన ఐటీ నిపుణులు, మెక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల సీఏఏపై మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం బాధ, విషాదం కలిగిస్తోందని సత్య నాదెళ్ల తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన సీఏఏపై కామెంట్ చేశారా లేదంటే భారతీయ పౌరులు ఎవరు, ఎవరు కాదు అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఓ దేశానికి వలసదారులతో మాత్రం మంచిదని మాత్రం అభిప్రాయపడ్డారు.

microsoft ceo Satya Nadella calls caa bad and sad..

బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు. ఈ మేరకు బెన్ స్మిత్ ట్వీట్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని తనతో చెప్పినట్టు స్మిత్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి.. తదుపరి ఇన్ఫొసిస్ కంపెనీ సీఈవో కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

బెన్ స్మిత్ చేసిన ట్వీట్ 280 పదాలకు పరిమితమైంది. ఇందులో చాలా అంశాలు కనిపించలేదు. సత్య నాదెళ్ల వలసదాలరు గురించి మాట్లాడారా..? అక్రమ వలసదారుల గురించి పేర్కొన్నారా అనే అంశంపై క్లారిటీ లేదు. అక్రమ వలసదారుల గురించి కాకుండా.. న్యాయపరంగా వచ్చే వలసదారులతో ఓ దేశ ఉన్నతికి సాయ పడుతుందని అర్థం వచ్చేలా ఉంది. దీంతో ఆ జాతి అభివృద్ధి చెందే వీలుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడి ఉంటారు.

English summary
Satya Nadella, an Indian immigrant in the us who now heads Microsoft, has called India’s new citizenship bill bad and sad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X