వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయచేసి మా వాళ్లను వదిలేయండి: ట్రంప్‌కు మైక్రోసాఫ్ట్ మొర

ఏడు ముస్లీం మెజార్టీ దేశాల నుంచి నిషేధం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు మొర పెట్టుకుంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఏడు ముస్లీం మెజార్టీ దేశాల నుంచి నిషేధం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు మొర పెట్టుకుంది. తమ కంపెనీకి చెందిన ఉద్యోగాలను మినహాయించాలని విజ్ఞప్తి చేసింది.

తమ ఉద్యోగులను ట్రావెల్ నిబంధనల నుంచి మినహాయించాలని, వీసా, ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ చట్టాలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తమకు వర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని శుక్రవారం నాడు మైక్రోసాఫ్ట్ మొరపెట్టుకుంది.

<strong>హెచ్1బీ వీసాలపై ఊరట ప్రకటన: 'ఇండియన్స్‌కు మరిన్ని అవకాశాలు'</strong>హెచ్1బీ వీసాలపై ఊరట ప్రకటన: 'ఇండియన్స్‌కు మరిన్ని అవకాశాలు'

ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జాన్ కెల్లీలకు, మైక్రోసాఫ్ట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ ఫోర్డ్ ఎల్ స్మిత్ లేఖ రాశారు.

Microsoft to feds: Please exempt our immigrant workers hit by travel ban

తమ సంస్థలో పని చేస్తున్న వారిలో 76 మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన 41 మంది నాన్ ఇమిగ్రెంట్లు, ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

<strong>ట్రంప్‌కు షాక్: ప్రపంచ చరిత్రలో తొలిసారి గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్..</strong>ట్రంప్‌కు షాక్: ప్రపంచ చరిత్రలో తొలిసారి గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్..

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో తాము సంప్రదించామని, వారంతా భయపడుతున్నారని, కుటుంబాల నుంచి తమ ఉద్యోగులు విడిపోవాల్సిన పరిస్థితిని కల్పించవద్దని స్మిత్ కోరారు.

ఉద్యోగ విధుల నిమిత్తం వారు విదేశీ ప్రయాణాలు సాగించాల్సి వస్తుందని, వారు తిరిగి అమెరికాలో కాలుమోపేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి నేర చరిత్రా లేని వారిని మాత్రమే తాము ఉద్యోగులుగా తీసుకుంటున్నామని, వారితో ఎలాంటి ఇబ్బందులూ రావని హామీ ఇచ్చారు.

English summary
Microsoft has formally asked the US Department of State and the Department of Homeland Security to grant it and other companies an exemption to the Trump administration’s executive order that restricts entry or re-entry of citizens from seven Muslim-majority countries. The order, which was signed last Friday, affects immigrants from Iran, Iraq, Yemen, Libya, Somalia, Sudan, and Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X