వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుదిపేస్తున్నమూకుమ్మడి రేప్‌లు: శరణార్థుల పనే

By Pratap
|
Google Oneindia TeluguNews

హెల్‌సింకీ: మధ్యప్రాచ్య దేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన శరణార్థుల కారణంగా ఐరోపా దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తాజాగా మరో భయంకరమైన సంక్షోభం కూడా ముందుకు వచ్చింది. ఐరోపా దేశాల మహిళలపై శరణార్థులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల వేళ జర్మనీలోని కోలోగ్నీ నగరంలో మూకుమ్మడి అత్యాచారాలు ప్రారంభమయ్యాయి.

ఆ తర్వాత ఆ అత్యాచార ఘటనలు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండులకు పాకాయి. జర్మనీలో దాదాపు 150 మంది మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు జరిగాయి. ఫిన్లాండ్ రాజధాని నగరం హెల్‌సింకీలో తాజాగా 50 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆస్ట్రియా, స్వీడన్ దేశాల్లో కూడా పాతిక సంఖ్యలోనే రేప్ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

దాంతో స్త్రీలు రాత్రిపూట ఇంటి నుంచి వీధుల్లోకి రాకూడదని, సమస్యాత్మక ప్రాంతాలు అసలే వెళ్లరాదని, క్లబ్బులూ పబ్బులూ అంటూ తిరగరాదని ఫిన్లాండ్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో 95 శాతం మంది శరణార్థులే. కాగా, బాధిత మహిళలంతా స్థానికులు.

Migrant rape fears spread across Europe

శరణార్థుల్లో 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారని యూరప్ దేశాల అధికారులు చెబుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన జరిగిన మూకుమ్మడి అత్యాచారాల సంఘటనల్లో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. వారిలో 9 మంది అల్జీరయన్లు, 8 మంది మొరాకోకు చెందినవారు, ఐదుగురు ఇరాకీయులు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జర్మన్లు ఉన్నారు.

డిసెంబర్ 31వ తేదీన జరిగిన అత్యాచార సంఘటలను జర్మనీ, ఆస్ట్రియా దేశాలు వారం రోజుల పాటు గుట్టుగా ఉంచాయి. దేశం పరువు పోతుందని, టూరిజం దెబ్బ తింటుందని, మహిళల్లో అభద్రతా భావం పెరుగుతుందని వాటిని వెల్లడించలేదని అంటున్నారు. ముఠాలుగా ఏర్పడి మహిళలపై దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు.

అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జర్మన్ టీవీలో ఇద్దరు మహిళలు తమపై జరిగిన సంఘటనల గురించి మాట్లాడారు. శరణార్థుల్లో సామాజిక మార్పు తేవడం ద్వారా అత్యాచారాలను అరికట్టవచ్చునని భావించిన నార్వేకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వారి కోసం సమాజం - సంస్కృతి అనే అశంపై ఉచితంగా కోర్సులను నిర్వహిస్తోంది.

English summary
Migrant rape fears spread across Europe: Women told not to go out at night alone after assaults carried out in Sweden, Finland, Germany, Austria and Switzerland amid warnings gangs are co-ordinating attacks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X