• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం

|

వాషింగ్టన్: గత కొద్ది రోజులుగా భారత సరిహద్దుల వద్ద చైనా తన బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని అమెరికా 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.

  US Foreign Affairs Panel Slams China Over Border Dispute

  'భారత సైనికులను అదుపులోకి తీసుకున్న చైనా దళాలు’: ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?

  డ్రాగన్ దుశ్చర్యలపై..

  డ్రాగన్ దుశ్చర్యలపై..

  ఓ వైపు భారత్‌కు మద్దతు తెలుపుతూ.. డ్రాగన్ దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు పాంపియో. ఇటీవల తూర్పు లడఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో వాస్తవధీన రేఖ వెంట భారత్-చైనా సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. అంతేగాక, తరచూ చైనా దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

  చైనా తీరుపై మండిపాటు..

  చైనా తీరుపై మండిపాటు..

  ఈ నేపథ్యంలోనే చైనా దుందుడుకు వ్యవహారాన్ని పాంపియో తప్పుబట్టారు. అలాగే, హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, కరోనా సృష్టి, వ్యాప్తి అంశాలను ప్రస్తావించిన ఆయన.. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత సరిహద్దుల్లో బలగాల మోహరింపును చైనా కొనసాగిస్తూనే ఉందని పాంపియో చెప్పారు.

  చైనా అంతే... కానీ అమెరికాకు ఆ సత్తా ఉంది..

  చైనా అంతే... కానీ అమెరికాకు ఆ సత్తా ఉంది..

  కరోనావైరస్ విషయంలో ప్రపంచానికి నిజాలు తెలియజేయడంలోనూ ఇంకా ఉదాసీనంగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేందుకు సిద్దమైందన్నారు. ఈ అంశాలు చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవహార శైలికి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమేనన్నారు పాంపియో. అంతేగాక, మేధో హక్కులను కొల్లగొట్టడం, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఇంకా ప్రయత్నిస్తుండటం వారి నియంతృత్వ పోకడలకు నిదర్శనమని దుయ్యబుట్టారు. చైనా యత్నాలను నిరోధించాల్సిన సామర్థ్యం అమెరికాకు ఉందని అన్నారు.

  డ్రాగన్ తీరు మారడం లేదు..

  డ్రాగన్ తీరు మారడం లేదు..

  కాగా, చైనా గత కొన్నేళ్లుగా అదే వైఖరిని అవలంభిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేగాక, వివిధ ప్రాంతాల్లో చైనా తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోందని తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట వివిధ ప్రాంతాల్లో నౌకాశ్రయాల్ని నిర్మిస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇవన్నీ తమ నావికా స్థావరాలుగా మార్చుకునేందుకు వ్యూహాలు పన్నుతోందని మండిపడ్డారు.

  వివాదాలకు చైనా ముగింపు పలకాలి..

  వివాదాలకు చైనా ముగింపు పలకాలి..

  యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫారేన్ ఎఫైర్స్ కమిటీ చీఫ్ ఎల్లయెట్ ఏంజెల్ మాట్లాడుతూ.. భారత సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట చైనా దుందుడుకు చర్యలు ఎంతమాత్రం సరికాదన్నారు. చైనా.. దౌత్య నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ చైనా వ్యవహరించాలన్నారు. భారత్‌తో సరిహద్దు వివాదానికి ముగింపు పలకాలని అన్నారు. కాగా, చైనా, భారత్ వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను ఇరు దేశాలు కూడా తిరస్కరించడం గమనార్హం.

  English summary
  Elliot Engel, chief of the US House of Representatives Foreign Affairs Committee, on Monday said that he was "extremely concerned" by the Chinese aggression against India along the Line of Actual Control in Ladakh and urged Beijing to "respect norms and use diplomacy and existing mechanisms to resolve its border questions".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more