వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా ముందు మాటల యుద్ధానికి దిగిన అమెరికా చైనా మంత్రులు

|
Google Oneindia TeluguNews

చైనాలో పర్యటిస్తున్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపే అన్ని అంశాలపై అమెరికా వైఖరిని చైనా విదేశాంగ మంత్రి వాంగా ఈకి కుండ బద్దలు కొట్టినట్లు తెలిపారు. ఏదీ దాచకుండా చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు మైక్. ప్రస్తుతం అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే మైక్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లు సైతం నిరాశజనకంగా మారాయి. అంతేకాదు దీనితో పాటు ఇరు దేశాలకు ఉత్తరకొరియా తైవాన్ అంశాలు కూడా కొరకరాని కొయ్యగా మారాయి.

<strong>మేమూ తగ్గం : పాక్‌కు 48 మిలటరీ డ్రోన్లను విక్రయించనున్న చైనా</strong>మేమూ తగ్గం : పాక్‌కు 48 మిలటరీ డ్రోన్లను విక్రయించనున్న చైనా

సమావేశం తర్వాత మైక్, వాంగ్ ఈ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే మాటల యుద్ధం ఇరు నేతల మధ్య కనిపించింది. సంయుక్త సమావేశంలో మొదటగా మాట్లాడారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ. అమెరికా వాణిజ్యపరంగా చైనాపై యుద్ధం ప్రకటిస్తుండటం సహించలేమని అన్నారు. అంతేకాదు తైవాన్‌ అంశంలో కూడా అమెరికా జోక్య చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నట్లు వాంగ్ ఈ పేర్కొన్నారు. చైనా హక్కులను, ఆసక్తులను కాలరాసేలా తైవాన్ వ్యవహరిస్తోందని... దీనికి అమెరికా వంత పాడటం బాగోలేదని వాంగ్ ఈ అన్నారు. ఇకనైనా ఈ వ్యవహారానికి అమెరికా చెక్ పెడుతుందని భావిస్తున్నట్లు చైనా కోరింది.

 Mike Pompeo and wang yi trade harsh words

ఇక మైక్ వంతు వచ్చినప్పుడు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చైనా లేవనెత్తిన అంశాలపై ప్రాథమిక అసమ్మతి ఉందని మైక్ చెప్పారు. చైనాతో తీసుకున్న చర్యలపై అమెరికా దృష్టి సారించినట్లు మైక్ తెలిపారు. అయితే ప్రతి అంశంపై కూలంకుషంగా చైనాతా చర్చించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని మైక్ వెల్లడించారు. అంతేకాదు ఉత్తరకొరియా పూర్తిగా అణ్వాయుధాల తయారీకి స్వస్తి చెప్పేలా చైనా ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుందని అమెరికా అభిప్రాయపడింది. మరోవైపు చైనా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని వాంగ్ ఈ తప్పుబట్టారు.

English summary
In unusually blunt language to an American secretary of state, China’s foreign minister accused the United States on Monday of interfering in its internal affairs and of harming his nation’s interests on the question of Taiwan.In a face-to-face exchange with Secretary of State Mike Pompeo, the foreign minister, Wang Yi, chided the Trump administration for “ceaselessly elevating” trade tensions and “casting a shadow” over relations between the two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X