వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొబ్బరి చెట్టెక్కిన మంత్రి .. అక్కడ నుండే కొబ్బరి కొరతపై మాట్లాడిన మంత్రి .. కారణమేంటంటే !!

|
Google Oneindia TeluguNews

శ్రీలంకకు చెందిన ఓ మంత్రి కొబ్బరి చెట్టు ఎక్కారు. శ్రీలంక ప్రజలకు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కొబ్బరి కొరతపై కొబ్బరి చెట్టు ఎక్కి మరీ మంత్రి చేసిన పని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అయితే ఆయన చెట్టు ఎక్కటానికి కారణం లేకపోలేదు .

 చెట్టు ఎక్కే యంత్రాన్ని పరీక్షించిన మంత్రి

చెట్టు ఎక్కే యంత్రాన్ని పరీక్షించిన మంత్రి


చెట్టు ఎక్కే యంత్రం సహాయంతో మంత్రి డాంకోటూవాలోని తన ఇంటి తోట వద్ద మంత్రి ఫెర్నాండో కొబ్బరి చెట్టు ఎక్కారు. ఈ యంత్రాన్ని వారకపోలకు చెందిన ఒక వ్యక్తి తయారు చేసి ఇవ్వగా మంత్రి పరీక్షించారు. రాబోయే రోజుల్లో ఈ యంత్రాన్ని స్థానిక మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు ఫెర్నాండో తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి ఫెర్నాండో ఆ యంత్రం సహాయంతో చెట్టు ఎక్కినట్టు తెలుస్తుంది. ఇక చెట్టెక్కిన మంత్రి వినూత్నంగా ఉంటుందని అక్కడ నుండే మాట్లాడారు. శ్రీలంకలో కొబ్బరి పరిశ్రమ సంక్షోభం నుండి బయట పడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు గా మంత్రి ఫెర్నాండో తెలిపారు.

దేశంలో కొబ్బరి డిమాండ్ .. ఖాళీ స్థలాలలో సాగు చెయ్యాలన్న మంత్రి

దేశంలో కొబ్బరి డిమాండ్ .. ఖాళీ స్థలాలలో సాగు చెయ్యాలన్న మంత్రి


దేశంలో కొబ్బరి అవసరాన్ని తెలియజేస్తూ, ఖాళీగా ఉన్న స్థలాలలో కొబ్బరి చెట్లు ఎక్కువగా పెంచాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 70 కోట్ల కొబ్బరి చెట్ల కొరత ఉందని పేర్కొన్న మంత్రి కొబ్బరికి అధిక డిమాండ్ ఉన్న కారణంగా, కొరత తీర్చడం కోసం ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కూడా కొబ్బరి చెట్లను పెంచాలని పేర్కొన్నారు.

కొబ్బరి కొరతను తీర్చడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కొబ్బరి చెట్టు ఎక్కి మరీ అరుందికా ఫెర్నాండో పేర్కొన్నారు.

దేశంలో కొబ్బరి కొరత ఉందన్న మంత్రి

దేశంలో కొబ్బరి కొరత ఉందన్న మంత్రి

కొబ్బరి కొరతను అధిగమించడం కోసం ప్రజలకు కొబ్బరి డిమాండు గట్టిగా చెప్పడం, అలాగే ప్రభుత్వం సైతం కొబ్బరి తోటల సాగు పై దృష్టి సారిస్తుందని చెప్పటం కోసం మంత్రి చేసిన పని చర్చనీయాంశమవుతోంది.


స్థానిక పరిశ్రమలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా, దేశీయ వినియోగం ఎక్కువగా ఉన్న కారణంగా దేశం మొత్తంగా 700 మిలియన్ల కొబ్బరికాయల కొరతను ఎదుర్కొంటోందని మంత్రి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి భూమిని కొబ్బరికాయలు సాగు కోసం ఉపయోగించుకోవాలని, దేశానికి విదేశాలకు కొబ్బరి ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని అందించే కొబ్బరి పరిశ్రమకు వృద్ధి నివ్వాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరికి డిమాండ్ ఉందన్న ఫెర్నాండో

ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరికి డిమాండ్ ఉందన్న ఫెర్నాండో


కొబ్బరి ధరల సమస్యలకు పరిష్కారంగా దేశంలో కొబ్బరికాయల కొరత ఉన్న నేపథ్యంలో ధరలను తగ్గించాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

శ్రీలంకలో మరియు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికాయలు పెరుగుతున్న ధరలపై ఫెర్నాండో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికాయల డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని ఆయన మీడియాతో అన్నారు.

English summary
To convey the message to the people on the shortage of coconuts, Sri Lankan State Minister of Coconut Arundika Fernando climbed a coconut tree and said that the country is facing a dearth of 700 million coconuts due to high demand for local industries and domestic consumption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X