వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ భామకు విశ్వసుందరి కిరీటం.. భారత సుందరికి టాప్ 13 లో కూడా లేదు

ఫ్రాన్స్ కు చెందిన 23 ఏళ్ల ఇరిస్ మిట్టెనరి ఈ ఏడాది మిస్ యూనివర్స్ గా ఎంపికైంది.తొలి రన్నరప్ గా మిస్ హైతీ రక్వెల్ పెలిస్సైర్, రెండో రన్నరప్ గా మిస్ కొలంబియా ఆండ్రియా తొవర్ నిలిచారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మనీలా: ఫ్రాన్స్ కు చెందిన 23 ఏళ్ల ఇరిస్ మిట్టెనరి ఈ ఏడాది మిస్ యూనివర్స్ గా ఎంపికైంది. ఫిలిప్పైన్స్ లోని మనీలాలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో హోస్ట్ స్టీవ్ హార్వే.. మిస్ ఫ్రాన్స్ ఇరిస్ ను విజేతగా ప్రకటించారు.

ఈ పోటీల్లో తొలి రన్నరప్ గా మిస్ హైతీ రక్వెల్ పెలిస్సైర్, రెండో రన్నరప్ గా మిస్ కొలంబియా ఆండ్రియా తొవర్ నిలిచారు. మిస్ యూనివర్స్ ఇరిస్ ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలోని లిల్లే పట్టణంలో జన్మించారు.

Miss France beats Haiti and Colombia to clinch Miss Universe title

డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఈమెకు క్రీడలు, ప్రయాణలు చేయడంతోపాటు ఫ్రెంచ్ వంటకాలు చేయడం అభిరుచులు. ఈ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన రోష్మితా హరిమూర్తి చాలా వెనుకబడిపోయారు.

రోష్మితా హరిమూర్తికి టాప్ 13 లో కూడా స్థానం దక్కలేదు. 1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న మన దేశానికి చెందిన సుస్మితాసేన్ కూడా ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయనిర్ణేతల్లో ఒకరుగా వ్యవహరించారు.

English summary
Miss France is the new Miss Universe. Decked out in a gold-sequined gown, 24-year-old dental surgery student Iris Mittenaere beat 12 other finalists to take the crown. As Miss Universe, she will be campaigning for dental and oral care around the world. First and second runner-ups were Miss Haiti (Raquel Pelissier) and Miss Colombia (Andrea Tovar).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X