వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్ ప్రేమలో 84 ఏళ్ల మీడియా మొఘల్

By Pratap
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెలెస్: ప్రపంచ మీడియా మొఘల్, ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ చైర్మన్ రూపర్ట్ మర్దోచ్ తనకన్నా చిన్నదైన మోడల్ జెర్రీ హాల్ ప్రేమలో పడ్డారు. 84 ఏళ్ల లేటు వయస్సులో మర్దోచ్ 59 ఏళ్ల మోడల్ హాల్‌తో డేటింగ్ చేస్తున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన 59 ఏళ్ల జెర్రీ హాల్ మిక్ జగ్గర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు కార్యక్రమంలో మర్దోచ్, జెర్రీ హాల్ తమ ప్రేమను బయటి ప్రపంచానికి తెలియజేస్తూ చేతుల్లో చేతులు వేసి తిరిగారు. మర్దోచ్ ఆమె బుగ్గపై ముద్దు కూడా పెట్టాడు.

Model Jerry Hall and media baron Rupert Murdoch began dating

నాలుగు నెలలుగా వారిద్దరు డేటింగ్ చేస్తున్నారు. తమకు నిశ్చితార్థం జరిగిందని కూడా ప్రకటించారు. మర్దోచ్‌కు ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉన్నారు. జెర్రీ హాల్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. మర్దోచ్ తన మూడో భార్యకు ఇప్పటికే విడాకులు ఇచ్చాడు.

మర్జోచ్, హాల్ మధ్య ప్రేమయాణం అక్టోబర్ నెలలో బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు కార్యక్రమంలో అది పూర్తిగా వెల్లడైంది. వారిద్దరు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోవడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని, తమ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారని మర్దోచ్ కుటుంబ అధికార ప్రతినిధి అన్నారు.

English summary
Media mogul Rupert Murdoch and former supermodel Jerry Hall have announced their engagement after a whirlwind four-month romance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X