వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడర్నా వ్యాక్సిన్‌ గుడ్‌న్యూస్‌- కరోనా నుంచి కనీసం మూడు నెలలు గ్యారంటీ సేఫ్

|
Google Oneindia TeluguNews

అమెరికన్ ఫార్మా దిగ్గజం మోడర్నా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ పై భారీ అంచనాలున్నాయి. అమెరికాలో బైడెన్‌ సర్కారు కూడా దీన్ని సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సమర్ధతపై చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. వీటిలో తాజా అధ్యయనం మోడర్నా వ్యాక్సిన్‌ కనీసం మూడు నెలల పాటు కరోనాకు వ్యతిరేకంగా సమర్ధంగా పనిచేస్తుందని తేలింది.

అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ అలర్జీస్‌ అండ్‌ ఇన్‌ఫెక్షనల్ డిసీజెస్‌ (ఎన్‌ఏఐడీ) మోడర్నా వ్యాక్సిన్‌పై పరిశోధన చేసింది. ఇందులో మోడర్నా వ్యాక్సిన్‌ శరీరంలో రోగనిరోధకాలను పెంచేందుకు కనీసం మూడు నెలలపాటు సమర్ధవంతంగా పనిచేస్తందని నిర్ధారించింది. 28 రోజుల వ్యవధిలో వివిధ వయోవర్గాలకు చెందిన 34 మందిపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ విషయం తేలినట్లు మోడర్నాతో కలిసి ఈ అధ్యయనం చేస్తున్న ఎన్‌ఏఐడీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఎంఆర్‌ఎన్‌ఏ 1273గా పిలుస్తున్న మోడర్నా వ్యాక్సిన్‌ పనితీరుపై తాజాగా వీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు న్యూ ఇంగ్లాడ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

Moderna vaccine provides immunity from coronavirus for at least 3 months, says study

మోడర్నా వ్యాక్సిన్‌పై నిర్వహిస్తున్న క్రినికల్‌ ట్రయల్స్‌లో ఇది వృద్ధుల కంటే యువకుల మీద ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారణ అయింది. 70 ఏళ్ల పైబడిన వారితో పోలిస్తే అంత కంటే తక్కువ వయసు కలిగిన వారిలో ఇది ఎక్కువ రోగనిరోధకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తేలింది. ట్రంప్‌ హయాంలో ఎన్‌ఏఐడీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆంటోనీ ఫాసీని ఆయన లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన సూచనల ప్రకారమే బైడెన్ నడుచుకుంటున్నారు. దీంతో ఎన్‌ఐఏడీ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
A new study has claimed that Moderna Inc's coronavirus vaccine can confer immunity against the virus for at least three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X