వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడు!: ట్రంప్ కంటే డబుల్‌తో రికార్డ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అనుసరించే ప్రపంచ నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డ్ సృష్టించారు. 4.32 కోట్లమంది మోడీని ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ 2.31 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఫేస్‌బుక్‌లో ప్రపంచ నాయకులు పేరిట బర్సన్‌ కోన్‌ అండ్‌ వోల్ఫ్‌ (బీసీడబ్ల్యూ) సంస్థ ఈ జాబితా విడుదల చేసింది. 650 మంది దేశాధిపతులు, ప్రభుత్వ అధినేతలు, విదేశాంగ మంత్రులకు చెందిన ఫేస్‌బుక్‌ పేజీలను సంస్థ విశ్లేషించింది. గత ఏఢాది జనవరి 1 నుంచి సమాచారాన్ని పరిశీలించింది.

మోడీ ఆ ఫోటో ఎక్కువమంది ఇష్టపడ్డారు

మోడీ ఆ ఫోటో ఎక్కువమంది ఇష్టపడ్డారు

2017లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోల్లో ఐదింటిని మోడీనే షేర్ చేశారు. ఒడిశాలోని ప్రఖ్యాత లింగరాజ్ దేవాలయ సందర్శన సమయంలో మోడీ తీసుకున్న ఫోటో ఎక్కువ మంది మెచ్చిన ఫోటోగా రికార్డు సృష్టించింది.

వ్యక్తిగత ఫేస్‌బుక్‌లు

వ్యక్తిగత ఫేస్‌బుక్‌లు

2018 మార్చి 15వ తేదీ నాటికి ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలను అనుసరించే వారి సంఖ్య 30.9 కోట్లుగా ఉంది. 2017 జనవరి 1 నుంచి మొత్తంగా 5లక్షలకు పైగా పోస్టులు చేశారు. వీటిపై 90 కోట్ల సంభాషణలు జరిగాయి. ఐక్య రాజ్య సమితి దేశాల్లో 91 శాతం దేశాలకు అధికారిక ఫేస్‌బుక్ పేజీలు ఉన్నాయి. దీనికి 109 మంది దేశాధిపతులు, 86 మంది ప్రభుత్వ అధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులకు వ్యక్తిగత ఫేస్‌బుక్ పేజీలు ఉన్నాయి.

సంభాషణల్లో ట్రంప్ టాప్

సంభాషణల్లో ట్రంప్ టాప్

గత పద్నాలుగు నెలల్లో ట్రంప్ ఫేస్ బుక్ పేజీ పైనే ఎక్కువ సంభాణలు చోటు చేసుకున్నాయి. ఆయన పేజీలో లైక్‌లు, వ్యాఖ్యలు, షేర్ల సంఖ్య 20 కోట్లకు పైగా. మోడీ పేజీ పైన 11 కోట్లకు పైగా ఉంది.

ట్రంప్ కంటే దాదాపు రెండు రెట్లు

ట్రంప్ కంటే దాదాపు రెండు రెట్లు

ఫేస్‌బుక్ ఫాలోవర్లలో ట్రంప్ కంటే మోడీ దాదాపు రెండు రెట్లు ఉన్నారు. మోడీ ఫాలోవర్లు 43.2 మిలియన్లు అయితే, ట్రంప్ ఫాలోవర్లు 23.1 మిలియన్లు. సోషల్ మీడియాలో మోడీ చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే.

English summary
Prime Minister Narendra Modi is the most liked world leader and far ahead of others, including US President Donald Trump, when it comes to popularity on Facebook, according to a study which said 43.2 million people follow the Indian premier on the social media platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X