వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధి రేటు పెరగొచ్చు: మోడీకి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. భారత ఆర్థిక వ్యవస్థ మోడీ ద్వారా ప్రయోజనం పొందుతోందని తన ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది. మోడీ ప్రభావంతో 2015-16లో భారత వృద్ధి రేటు 6.4 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది.

మోడీ ప్రభుత్వం పైన ఉన్న విపరీతమైన అంచనాల కారణంగా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటోందని స్పష్టం చేసింది. అయితే, సంస్కరణలు ఇంకా వేగం పుంజుకోవాల్సి ఉందని తెలిపింది. 2014-15లో వృద్ధి 5.6 శాతంగా జీడీపీ నమోదు కావొచ్చునని, 2015-16లో 6.4 శాతానికి, 2016-17లో 7 శాతానికి చేరవచ్చునని పేర్కొంది.

Modi dividend may push up growth, economy set to grow by 6.4% in 2015-16: WB

భారత్ వృద్ధి కారణంగా దక్షిణాసియాలో 2015లో ఆరు శాతం, 2016లో 6.4 శాతం చొప్పున వృద్ధి నమోదు కావొచ్చునని, ఈ ప్రాంత ఉత్పత్తిలో భారత్‌ది 80 శాతం కావడమే అందుకు కారణమని తెలిపింది.

కాగా, చైనా వృద్ధి రేటు వచ్చే ఏడాది 7.2గా ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం సంస్కరణల వల్ల మార్కెట్లో తిరిగి పుంజుకుంటున్న విశ్వాసం దోహదం చేసి భారత్ వృద్ధి రేటు 6.4కు పెరగవచ్చునని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. చైనా ఈ ఏడాది సాధించే వృద్ధి రేటు కంటే వచ్చే ఏడాది తగ్గవచ్చునని అభిప్రాయపడింది.

English summary

 A 'Modi dividend' could lift India's economic growth to 6.4% in 2015-16, the World Bank has said, referring to a possible boost to the animal spirits of entrepreneurs due to the coming to power in May of a government perceived to be more market-friendly than the previous one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X