వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ సెల్లర్ నుండి.. మోడీ నన్ను ఇంప్రెస్ చేశారు: ఒబామా, భారత్ పర్యటనపై గర్విస్తున్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ఆదివారం నాడు భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ ముఖాముఖిలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. అలాగే, భారత్ రెండోసారి పర్యటిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.

మోడీ విజన్‌కు ఒబామా ఫ్లాట్ అయ్యారు! మోడీకి మంచి విజన్ ఉందని, ఆయన భారత్‌ను ప్రగతిపథంలోకి తీసుకు వెళ్లాలనుకుంటున్నారన్నారు. అడ్డంకులు ఎదురైనా ఎకనామిక్ గ్రోత్‌ను పెంచేందుకు మోడీకి సామర్థ్యం, సంసిద్దత ఉన్నాయన్నారు.

Modi has a clear vision for India: Obama

తీవ్రవాదం పైన నిలకడమీద ఉన్నారని చెప్పారు. ఇటీవల జరిగిన చారిత్రక ఎన్నికలు భారత్ ఎకనామిక్ గ్రోత్ కోరికకు అద్దం పడుతున్నాయన్నారు. ఓ సాధారణ చాయ్ అమ్ముకునే వ్యక్తి భారత ప్రధాని అయ్యారంటే... అది భారత ప్రజల యొక్క సామర్థ్యానికి నిదర్శనమన్నారు.

మోడీకి క్లియర్ విజన్ ఉందన్నారు. మోడీ శక్తిసామర్థ్యాలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. భారత్ - అమెరికా సంబంధాల పైన స్పందిస్తూ.. ఏ రెండు దేశాల మధ్య కూడా ప్రతి విషయంలోను అంగీకారం కుదిరే పని కాదన్నారు. అలాగే భారత్, అమెరికా మధ్యలో కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఇరు దేశాలు కూడా పరస్పరం గౌరవంతో ముందుకు వెళ్తాయన్నారు. అమెరికా ప్రధానిగా భారతదేశంలో రెండోసారి పర్యటిస్తున్నందుకు గర్విస్తున్నానని ఒబామా అన్నారు. భారత్‌లో రెండోసారి పర్యటిస్తున్న అమెరికా ప్రధానిని తానే అన్నారు.

English summary
Narendra Modi has a clear vision for India, says Barack Obama
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X