వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని సంస్కరణలు: సింగపూర్‌లో మోడీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

సింగపూర్: పెట్టుబడులకు ఉత్తమమైన గమ్యస్థానం భారత దేశమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విదేశీ పెట్టుబడులకు ఇంకా ఆకర్షణీయంగా ఉండేలా మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నామని చెప్పారు. మంగళవారం సింగపూర్‌లో జరిగిన 'భారత్‌-సింగపూర్‌ ఆర్థిక సమ్మేళనం'లో పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కార్పొరేట్లతో భేటీ అయ్యారు.

భారత్‌కు వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలనీ, ముఖ్యంగా నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో భాగం పంచుకోవాలనీ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) 2016 నుంచి అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో ఛాంగి విమానాశ్రయంతో భాగస్వామ్యం కోసం పరిశీలిస్తున్నామన్నారు. సింగపూర్‌ అంటే ఆసియాకు ఆర్థిక సింహం వంటిదని మోడీ అభివర్ణించారు. భారత్‌ రూపాంతరీకరణలో ప్రతీ అంశంలో సింగపూర్‌ ప్రధాన భాగస్వామిగా ఉందన్నారు.

సింగపూర్ ప్రవాసీ సదస్సులో మోడీ

సమైక్యత, సమగ్రతే తారకమంత్రంగా ప్రపంచంలో దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. భారత్‌లో అసహన ధోరణులు ప్రబలమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ భారతీయులనుద్దేశించి మాట్లాడిన మోడీ ‘సమైక్యత, సమగ్రత భారతీయ సంస్కృతిలో భాగం. ఇదే నినాదంతో, ఇదే మంత్రంతో, ఇదే సందేశంతో ముందుకు సాగండి' అని అన్నారు.

భారత్‌లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానాలను వివరించిన మోడీ, సమైక్యత, సామరస్య భావనలను బలోపేతం చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

పెట్టుబడులకు ఉత్తమమైన గమ్యస్థానం భారత దేశమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విదేశీ పెట్టుబడులకు ఇంకా ఆకర్షణీయంగా ఉండేలా మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నామని చెప్పారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మంగళవారం సింగపూర్‌లో జరిగిన 'భారత్‌-సింగపూర్‌ ఆర్థిక సమ్మేళనం'లో పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కార్పొరేట్లతో భేటీ అయ్యారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌కు వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలనీ, ముఖ్యంగా నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో భాగం పంచుకోవాలనీ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) 2016 నుంచి అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌లో రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో ఛాంగి విమానాశ్రయంతో భాగస్వామ్యం కోసం పరిశీలిస్తున్నామన్నారు. సింగపూర్‌ అంటే ఆసియాకు ఆర్థిక సింహం వంటిదని మోడీ అభివర్ణించారు. భారత్‌ రూపాంతరీకరణలో ప్రతీ అంశంలో సింగపూర్‌ ప్రధాన భాగస్వామిగా ఉందన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

'ఆసియా సింహం గుజరాత్‌లో మాత్రమే కనిపిస్తుంది. అదే ఆసియా ఆర్థిక సింహం ఇక్కడ సింగపూర్‌లో మాత్రమే కనిపిస్తుంది' అని చమత్కరించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సింగపూర్‌ చిహ్నంలో కనిపించే ఆసియా సింహాన్ని చూడడానికి భారత్‌కు, ముఖ్యంగా గుజరాత్‌కు రావాలని లూంగ్‌ను ఆహ్వానించారు. సింగపూర్‌ గాలిలోనే ఎంతో శక్తి ఉందన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఎన్నో దేశాలకు ఈ దేశం స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. 'సింగపూర్‌ నాకేమీ కొత్త కాదు. కానీ వచ్చిన ప్రతిసారీ సరికొత్త స్ఫూర్తిని పొందుతుంటాను. ఈ గాలిలోనే ఆ శక్తి ఉంది.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భవిష్యత్తుపై మీ దార్శనిక సామర్థ్యం నుంచి, మీ కళ్లలో కనిపిస్తున్న స్నేహభావం నుంచి ఈ శక్తి వస్తోంది. సింగపూర్‌ లాంటి ప్రదేశమే మరొకటి లేదని అందుకే అంటారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సమైక్యత, సమగ్రతే తారకమంత్రంగా ప్రపంచంలో దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌లో అసహన ధోరణులు ప్రబలమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ భారతీయులనుద్దేశించి మాట్లాడిన మోడీ ‘సమైక్యత, సమగ్రత భారతీయ సంస్కృతిలో భాగం. ఇదే నినాదంతో, ఇదే మంత్రంతో, ఇదే సందేశంతో ముందుకు సాగండి' అని అన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానాలను వివరించిన మోడీ, సమైక్యత, సామరస్య భావనలను బలోపేతం చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

English summary
Promising more reforms to make India more attractive for foreign investments, Prime Minister Narendra Modi today assured investors that he would "carefully hold" their hands and expressed hope that the GST regime would be rolled out in 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X