వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో ట్రంప్‌తో భేటీ కానున్న ప్రధాని మోడీ, ఈ అంశాలపైనే ప్రధాన చర్చ

|
Google Oneindia TeluguNews

జపాన్ : జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రెందు దేశాల అధినేతల మధ్య ప్రధానంగా ఉగ్రవాదం, వాణిజ్యం అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా విబేధాలు తలెత్తాయి. ఓ వైపు తమ వస్తువులపై భారత్ అధిక సుంకం విధించడాన్ని జీర్ణించుకోలేకున్న అమెరికా... మరోవైపు రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయరాదంటూ ఆంక్షలు విధించింది.

trump and modi

ఇదిలా ఉంటే అమెరికా ఉత్పత్తులపై సుంకం చాలా వరకు తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలంగా కోరుతున్నారు. ఇక్కడే రెండు దేశాల మధ్య బేదాభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. చైనాతో అంతటి వాణిజ్య యుద్ధం కాకపోయినప్పటికీ భారత్‌తో ఇప్పుడిప్పుడే అమెరికా వాణిజ్య యుద్ధానికి దిగుతోంది.గతేడాది ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి ఎగుమతి అయ్యే అలూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకం విధించింది. అయితే సుంకం తగ్గిస్తుందేమో అని భారత్ కొన్ని నెలలపాటు వేచి చూసింది. సుంకం తగ్గించడమే కాకుండా భారత ఉత్పత్తులపై ఉన్న డ్యూటీ ఫ్రీ సుంకాన్ని ఎత్తివేస్తూ సుంకం విధించింది అమెరికా. ఇక అమెరికా కాలుదువ్వడంతో భారత్ కూడా అమెరికా వస్తువులపై 28శాతం అధిక సుంకాన్ని విధించింది.

భారత్ తీసుకున్న నిర్ణయంతో ట్రంప్ డిఫెన్స్‌లో పడిపోయారు. దీంతో జీ-20 సదస్సు ప్రారంభానికి ముందు ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం అమెరికా వస్తువులపై సుంకం విధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోడీతో సమావేశం అయినప్పుడు భారత్ విధించిన అధిక సుంకంపై చర్చిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. సుంకం విధింపు ఆమోదించమని వెంటనే దీన్ని రద్దు చేయాలని ట్రంప్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. ట్రంప్ వాదన ఇలా ఉంటే... ప్రధాని నరేంద్ర మోడీ కూడా తనదైన శైలిలో జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రష్యా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు పై విధించిన ఆంక్షలను సడలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్‌ను కోరనున్నారు.

English summary
Prime Minister Narendra Modi is in Japan and will be meeting US President Donald Trump on Friday in Osaka, the venue for G20 summit. Modi-Trump meeting assumes significance in the wake of increasing differences between the two countries over trade tariff, India's defence deal with Russia and US's posturing against Iran.Trade and terror are set to dominate the talks between Modi and Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X