• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక టీ అమ్ముకునే వాడిని ప్రధానిని చేసిన ఘనత భారత్‌ది: నాలుగోసారి ఐరాసలో మోడీ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు. ఆయన ప్రసంగం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. భారత దేశ గొప్పతనాన్ని వివరించేలా సాగింది.. ఆయన ప్రారంభ ఉపన్యాసం. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని.. ఈ అత్యున్నత వేదిక మీద ఆయనను స్మరించుకున్నారు నరేంద్ర మోడీ. ఒక టీ అమ్ముకునే సాధారణ కుర్రాడిని దేశ ప్రధానిని చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానికి ఉందని పేర్కొన్నారు.

హిందీలో ప్రసంగం..

భారత్ అంటే.. భారత దేశంలో ఎన్నో భాషలు, మరెన్నో సంస్కృతులు కలిసికట్టుగా సాగుతున్నాయని చెప్పారు. ఆయన ప్రసంగం మొత్తం హిందీలో సాగింది. భారత్ అంటే.. ఆ భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపేనని స్పష్టం చేశారు. తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రాణాంతక కరోనా వ్యాధి బారిన పడి మరణించిన వారికి మోడీ సంతాపం తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణం..

అతి తక్కువకాలంలో కోట్లాదిమందికి కరోనా వ్యాక్సిన్‌ను అందజేశామని అన్నారు. ఇప్పటిదాకా 83 కోట్ల మందికి పైగా ప్రజలకు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ మహోద్యమం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భిన్నత్వం ఏర్పడిందని అన్నారు. మరింత విస్తరించిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ప్రపంచ దేశాలను ఆహ్వానించారు.

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా భారత్..

భారత్‌ను అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ప్రధాని మోడీ అన్నారు. పర్యావరణానికి పరిరక్షించకపోవడం, హాని కలిగించడం వంటి చర్యల వల్ల ముందు తరాలవారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఎక్స్‌ట్రీమిజం ప్రమాదం పెరుగుతోందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి ద్వారా అలాంటి భావజాలాన్ని రూపుమాపొచ్చని సూచించారు. ఈ దిశగా తాము అనేక చర్యలను తీసుకున్నామని అన్నారు.

అభ్యుదయ భావాల యువత

భారత యువత అభ్యుదయ భావాలను పెంపొందించుకుంటోన్నారని, దీనికి నిదర్శనం.. ఇస్రో సాధించిన విజయాలేనని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కనుగొన్న అనేక రకమైన ప్రాజెక్టులను ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి పంపించామని గుర్తు చేశారు. కొత్త తరం యువత ఆలోచన సరళి మారుతోందని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ తరహా పరిస్థితులు మళ్లీ మళ్లీ ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితిపై ఉందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

భారత్ ట్రెండ్ సెట్టర్..


భారత్ ప్రపంచ దేశాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ నేడు అభివృద్ధి సాధిస్తే.. ప్రపంచం రేపు దాన్ని అనుసరిస్తుందని చెప్పారు. భారత్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలను ప్రపంచ దేశాలు అనుకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏ దేశానికైనా, ఏ సమాజానికైనా యువత పాత్ర కీలకమైనదని, అలాంటి చోట భారత్ అద్భుతంగా రాణించగలుగుతోందని అన్నారు. ఉగ్రవాదం యువతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని, దాన్ని ఎక్కడికక్కడ అణచివేయాల్సిందేనని చెప్పారు.

English summary
In the last 1.5 years, the entire world has been facing the worst pandemic in 100 years, I pay tribute to all those who have lost their lives in this deadly pandemic and I express my condolences to their families: PM Narendra Modi addresses 76th Session of UNGA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X