• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐక్యంగా ఉండకపోతే సింహాన్నీ కుక్కలు వేటాడుతాయి: చికాగో హిందూ సభలో మోహన్‌భగవత్

|

చికాగో: ఆధిపత్యం కోసం హిందువులు ఎప్పుడూ ఆరాటపడలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఆధిపత్యం చెలాయించడం, పెత్తనం చేయడం హిందూ తత్వం కాదని స్పష్టం చేశారు. అమెరికాలోని చికాగోలో జరిగిన రెండవ ప్రపంచ హిందూ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

1893లో వివేకానంద..

1893లో వివేకానంద..

1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొని, చారిత్రక ఉపన్యాసం చేశారు. ఆ సభ జరిగి 125 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు వివిధ కులాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ.. ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం హిందూ మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు.

ఐక్యంగా లేకుంటే సింహాన్నైనా కుక్కుల వేటాడుతాయి..

ఐక్యంగా లేకుంటే సింహాన్నైనా కుక్కుల వేటాడుతాయి..

అన్ని కులాలు, జాతులు ఒకటిగా కలిసి, హిందూ ఐక్యతను చాటాలన్నారు. ఇది ఇతరులపై ఆధికారానాన్ని చెలాయించడానికి కాదని వివరించారు. ఒంటరిగా ఉంటే సింహంపైన కూడా అడవి కుక్కలు దాడి చేసి చంపుతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని అన్నారు. మెరుగైన ప్రపంచాన్ని కోరుతున్నామని, వసుధైక కుటుంబమే హిందువుల నినాదమని అన్నారు. సంప్రదాయాలను పాటించడం అవసరమని అన్నారు. అయితే తాను ఆధునీకరణకు వ్యతిరేకిని కానని స్పష్టం చేశారు.

మన ధర్మం సనాతనం.. అత్యాధునికం

మన ధర్మం సనాతనం.. అత్యాధునికం

హిందూ ధర్మం అత్యంత సనాతనమైనదేకాకుండా, అత్యంత ఆధునికమైనదని వ్యాఖ్యానించారు. ‘సుమంత్రితే సువిక్రంతే' (సమష్టిగా ఆలోచించు.. గొప్ప విజయాన్ని సాధించు) అనేదే సూత్రం ఆధారంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ విధానమే యావత్ ప్రపంచాన్ని ఒకటి చేస్తుందని భగవత్ అన్నారు. అహాన్ని అదుపు చేసుకొని, అందరి అభిప్రాయాలనూ గౌరవించడం నేర్చుకుంటే వసుధైక కుటుంబ సాధ్యమవుతుందని తెలిపారు. కృష్ణ భవగవానుడు, ధర్మరాజు పరస్పరం ఎప్పుడూ విభేదించుకోలేదని గుర్తుచేశారు.

అదే తక్షణ కర్తవ్యం

అదే తక్షణ కర్తవ్యం

రాజకీయాలకు, యుద్ధనీతికి ప్రతీకగా మహాభారతం నిలుస్తుందని మోహన్ భగవత్ చెప్పారు. రాజకీయాలను ధ్యానంలా చేయకూడదని భగవత్ వ్యాఖ్యానించారు. హిందూ సమాజంలో అసాధారణ ప్రతిభాపాటవాలున్న వారి సంఖ్య చాలా ఎక్కువని అన్నారు. అయితే, వీరంతా ఒకేతాటిపైకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమైతే, పరిస్థితి మరో విధంగా ఉంటుందన్నారు. మూల సూత్రాలను మరచిపోతున్నందువల్లే హిందూ జాతి కొన్ని శతాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నదని భవగత్ గుర్తుచేశారు. హిందువుల ఐక్యత తక్షణ కర్తవ్యమని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lamenting that the Hindus have been suffering for thousands of years, RSS chief Mohan Bhagwat has asked them to come together and organise themselves, saying "if a lion is alone, wild dogs can invade and destroy him".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more