వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించలేదు: డ్రైవింగ్ సీటులోనే డెలివరీ, 3నెలలు ముందుగానే, ప్రపంచానికే ఆశ్చర్యం!

అసలు ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని బిడ్డ తల్లి స్కర్రీ చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

పిట్స్‌బర్గ్: పెన్సిల్వేనియాలోని పిట్స్ బర్గ్‌కు చెందిన ఓ మహిళ మూడు నెలలు ముందుగానే బిడ్డకు జన్మనివ్వడం విస్తుగొలుపుతోంది. మూడు నెలల ముందుగానే ఆ చిన్నారి తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని బిడ్డ తల్లి స్కర్రీ చెబుతున్నారు. డెలివరీ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న స్కర్రీ.. అందులోనే బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి ఆరోజు.. జస్ట్ అలా బయటకు వెళ్లొద్దామని స్కర్రీ బయలుదేరారు. కొంచెం దూరం వెళ్లాక.. ఆమెకు కడుపు నొప్పి మొదలైంది.

mom gives birth to premature baby still in amniotic sac

సాధారణంగా వచ్చే నొప్పులే అనుకున్నప్పటికీ.. నొప్పులు అంతకంతకూ పెరగడంతో కారును ఆసుపత్రి వైపు మళ్లించారు స్కర్రీ. ఇంతలో భర్త ఇయాన్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి రావాల్సిందిగా సమాచారం అందించారు. అయితే ఆసుపత్రికి చేరే లోపే.. డ్రైవింగ్ సీటులోనే ఆమె ప్రసవించారరు. బిడ్డ ఆమె చేతిలో పడినప్పుడు రక్షణ పొరతోనే ఉన్నాడు. ఈ రక్షణ పొర తల్లి కడుపులో ఉన్నప్పుడు అటూ ఇటు కదలడానికి, ఒత్తిడి నుంచి రక్షణగా, ఆహారం, శ్వాసం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

mom gives birth to premature baby still in amniotic sac

దీనిపై స్పందించిన వైద్యులు.. ప్రతీ 80వేల కేసుల్లో ఇలాంటిది ఒకటి అరుదుగా జరుగుతుందన్నారు. కాగా, 2016లొ తొలిసారి స్కర్రీ గర్భం దాల్చింది. ఇప్పుడు 11వారాల ముందుగానే మరో బిడ్డను ప్రసవించింది.

English summary
A Pittsburgh woman gave birth to her premature son in a vehicle on the way to the hospital — with the baby still in its amniotic sac.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X