వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మోనాలిసా' చైనాకు చెందిన బానిస, చిత్రకారుడు డావిన్సీకి తల్లి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హాంగ్ కాంగ్: ప్రఖ్యాత చిత్రకారుడు లియనార్డో డావిన్సీ గిసిన మోనాలిసా చిత్రం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. అయితే, డావిన్సీ గీసిన తన తల్లి చిత్రమే 'మోనాలిసా' అంటున్నారు. ఆమె చైనా నుంచి వచ్చిన బానిస అని హాంగ్ కాంగ్ బేస్డ్ చరిత్రకారుడు ఏంజిలో పరాటికో భావిస్తున్నారు. పరాటికో ఇటలీకి చెందిన చరిత్రకారుడు, నావలిస్ట్.

ఈ విషయాన్ని ఆయన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె వెనుక చైనాకు చెందిన ప్రకృతి దృశ్యం ఉందని చెప్పారు. అంతేకాదు, మోనాలిసా ముఖంలో చైనీయుల పోలికలున్నాయని ఆయన వివరించారు.

Mona Lisa a Chinese slave and Da Vinci's mother?

లియోనార్డో తండ్రి క్లయింట్లలో ఒకరి దగ్గర క్యాథరినా అనే మహిళా బానిస ఉండేదని, 1452లో లియోనార్డో పుట్టిన తరువాత ఆమె కనిపించలేదని యాంజిలో తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూ ప్రచురితమయ్యాక 40 లక్షల మంది చదవగా, 1.6 లక్షలకు పైగా పోస్టింగ్స్ వచ్చాయి.

ఏంజిలో పరాటికో చెప్పిన ఈ వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ప్రధానంగా చైనా వారు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనీయులు పలువురు నెట్లో వ్యంగ్య పేరడీలు కూడా పెడుతున్నారు. తనను విదేశీయురాలిగా చిత్రీకరించడం బాధాకరమని, తాను ఎక్కడి దానిని అయినప్పటికీ.. అందరు తనను ప్రేమిస్తున్నారని.. ఇలా నెట్లో ఎన్నో పోస్ట్‌లు పెడుతున్నారు.

English summary
An Italian historian's theory that Mona Lisa might be a Chinese slave and Leonardo da Vinci's mother -- making the 15th-century polymath half-Chinese -- sent online commentators into a frenzy Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X