• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం

By BBC News తెలుగు
|
మంకీ పాక్స్

ఇటీవల చైనాలో మంకీ బీ వైరస్‌తో ఒకరు చనిపోయారు. ఇప్పుడు అమెరికాలో మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి.

అమెరికాలోని 27 రాష్ట్రాల్లోని 200 మందికి మంకీ పాక్స్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు.

వారందరి గురించి వైద్యాధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

టెక్సస్‌కు చెందిన వ్యక్తికి మొదట ఈ మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ సోకినట్లు భావిస్తున్నారు.

ఈయన జులై ప్రారంభంలో నైజీరియా నుంచి టెక్సస్‌ వచ్చారు.

ఆయన నుంచి ఈ ఇన్ఫెక్షన్లు ఇతరులకు వ్యాప్తించినట్లు అనుమానిస్తున్నారు.

మంకీపాక్స్

2003 తర్వాత ఇదే మొదటిసారి

2003 తర్వాత అమెరికాలో మంకీపాక్స్‌ బయటపడటం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆ వ్యక్తి జులై 9న నైజీరియాలోని లాగోస్ నుంచి జార్జియాకి వెళ్లాడు. అక్కడి నుంచి డాల్లస్‌కు వెళ్లే క్రమంలో ఆసుపత్రిలో చేరాడని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

ఈ రెండు విమానాల్లో అతనితో పాటు ప్రయాణించిన వారు జబ్బు బారిన పడే అవకాశం ఉందని సీడీసీ ఆందోళన వ్యక్తం చేసింది.

మంకీపాక్స్ సోకిన వ్యక్తికి దగ్గరగా సంచరించిన వారికీ కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడానికి విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తున్నామని సీడీసీ తెలిపింది.

అయితే, ప్రయాణికులు ఫేస్‌ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన ఉన్నందున, విమానంలో వ్యాధి వ్యాప్తికి అవకాశాలు తక్కువే అని పేర్కొంది.

మంకీ పాక్స్‌ బారిన పడిన వారిని గుర్తించడానికి రాష్ట్ర, స్థానిక ఆరోగ్య విభాగాలతో కలిసి పని చేస్తున్నట్టు సీడీసీ ప్రతినిధి బీబీసీకి చెప్పారు.

సాధారణ ప్రజలకు ప్రమాదం తక్కువగా ఉందని భావిస్తున్నామని చెప్పారు. తమ పర్యవేక్షణలో ఉన్న 200 మందిలో ఎవరికీ కూడా తీవ్రమైన అనారోగ్యం లేదని తెలిపారు.

https://www.youtube.com/watch?v=12OE4XFRFqs

మంకీ పాక్స్ లక్షణాలేంటి

మంకీ పాక్స్.. మశూచిలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన అరుదైన వైరల్ వ్యాధి. కానీ దీని తీవ్రత తక్కువగా ఉంటుంది.

మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వస్తుంటుంది.

లక్షణాలు:

ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, వాపులు, వెన్నునొప్పి, కండరాల్లో నొప్పి ఉంటుంది.

ఒక్కోసారి జ్వరం ఎక్కువైన తర్వాత దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఈ దద్దుర్లు ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తిస్తాయి. ఎక్కువగా అరి చేతులు, పాదాలు, అరికాళ్లపై వస్తాయి.

చివరకు దద్దుర్లపై విపరీతమైన దురద వచ్చి పుండుగా మారుతుంది. పుండు తగ్గిన తర్వాత చర్మంపైన ఈ గాయాలు మచ్చలుగా ఉండిపోతాయి.

మంకీ పాక్స్ కూడా చికెన్ పాక్స్ లాంటిదే. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి మాత్రమే విషమంగా మారుతుంది.

మిగతావారికి మామూలుగానే కొన్ని వారాల్లో తగ్గిపోతుంది. వందల్లో ఒక్కరిపై మాత్రమే ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని సీడీసీ పేర్కొంది.

అమెరికాలో తొలిసారిగా ఈ వ్యాధిని 2003లో గుర్తించారు. అప్పట్లో ఈ వ్యాధి 47మందికి సోకింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Monkey b virus in China, now monkeypox in America
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X