• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహా కార్చిచ్చు: కాలిఫోర్నియా-లాస్ఏంజెల్స్, బాధితులుగా 25మిలియన్ ప్రజలు, ఆర్నాల్డ్ సహా హాలీవుడ్ తారలు

|

వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమ క్రమంగా లాస్ఏంజెల్స్ వరకు పాకింది. ప్రముఖులు, హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్‌వుడ్ సహా పలు శివారు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో అనేక విల్లాలు దగ్ధమయ్యాయి.

కాలిఫోర్నియా చరిత్రలోనే..

గంటకు 164 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు ఆ మంటలకు తోడవడంతో భారీ నష్టం జరుగుతోంది. సుమారు 25 మిలియన్ల ప్రజలు ఈ కార్చిచ్చు బాధితులుగా మారడం గమనార్హం. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అతిపెద్ద కార్చిచ్చుగా నిలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎమర్జెన్సీని ప్రకటించారు. మంగళవారం రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలను జారీ చేశారు.

అర్ధరాత్రి పరుగులు తీసిన సెలబ్రిటీలు..

అర్ధరాత్రి పరుగులు తీసిన సెలబ్రిటీలు..

అర్ధరాత్రి అగ్నికీలలు ఎగిసిపడటంతో సెలబ్రిటీలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. బ్రెంట్‌వుడ్ ప్రాంతంలో మిలియన్ డాలర్లు విలువ చేసే పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ లిబ్రోన్, హాలీవుడ్ ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, మీడియా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తదితరులు ఈ ప్రాంతంలోనే నివాసముంటున్నారు. తెల్లవారుజామున లిబ్రోన్ జేమ్స్ ఇంటికి నిప్పంటుకోవడంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు పరుగులు తీశారు. కాగా, జేమ్స్ 2017లో 23 మిలియన్ డాలర్లతో ఈ ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం.

ఆర్నాల్డ్ సహా.. ప్రముఖులంతా..

ఆర్నాల్డ్ సహా.. ప్రముఖులంతా..

ఇక ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా మంటలు వ్యాపిస్తుండటంతో వారి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హెలికాప్టర్లు, విమాన ట్యాంకర్లు, అగ్పిమాపక వాహనాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

టెర్మినేటర్ ప్రీమియర్ రద్దు

టెర్మినేటర్ ప్రీమియర్ రద్దు

కాలిఫోర్నియా అడవుల కార్చిచ్చు అంతకంతకూ పెరిగిపోతుండటంతో పారమౌంట్ పిక్చర్స్, స్కై డ్యాన్స్ టెర్మినేటర్ సినిమా ప్రీమియర్‌ను రద్దు చేసిందని ఓ పత్రికా ప్రకటనను రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేస్తామని, ఇందుకోసం సేవ అందిస్తున్న రెడ్ క్రాస్‌ను సంప్రదించామని ఓ ప్రకటనలో తెలిపారు.

సురక్షిత ప్రాంతాలకు తరలాలంటూ ఆర్నాల్డ్ ట్వీట్

సురక్షిత ప్రాంతాలకు తరలాలంటూ ఆర్నాల్డ్ ట్వీట్

‘లాస్ ఏంజెల్స్ నుంచి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మీలో ఎవరైనా ఆ ప్రాంతంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. ఆ చుట్టు పక్కల ఉండకండి. ఈ ఆపద సమయంలో అగ్నిమాపక నిపుణులే రియల్ హీరోలు అంటూ ఆర్నాల్డ్ ట్వీట్ చేశారు. కాలిఫోర్నియా వాసులను కాపాడే చర్యలు చేపట్టండి' అంటూ అర్నాల్ సూచించారు.

కాలిఫోర్నియా నుంచి లాస్ఏంజెల్స్ వరకు..

కాలిఫోర్నియా నుంచి లాస్ఏంజెల్స్ వరకు..

అక్టోబర్ 23న కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఈ కార్చిచ్చు.. ఇప్పుడు లాస్‌ఏంజెల్స్ వరకు వ్యాపించింది. మంటల్లో అనేక ఇళ్లు కాలిపోతున్నాయి. లక్షలాది చెట్లు దగ్ధమవుతున్నాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భద్రతా అధికారులు, సహాయక బృందాలు వేగంగా స్పందిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సుమారు 25 మిలియన్ల ప్రజలు ఈ కార్చిచ్చు బాధితులుగా మారారని అధికారులు చెబుతున్నారు.

English summary
More than 25 million people are under red flag warnings in California as fires burn across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more