వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భాషలేవో తెలుసా!

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భాషల జాబితాలో మన జాతీయ భాష హిందీ పదో స్థానంలో నిలిచింది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచీకరణ అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ రంగాలు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సాంస్కృతిక, సామాజిక రంగాలకు సంబంధించి భాషకే పెద్దపీట.

ఈ నేపథ్యంలోనే ఆరువేల భాషలు మాట్లాడుకునే ప్రస్తుత ప్రపంచంలో.. అత్యంత శక్తివంతమైన భాషలేవో తెలుసుకునే ప్రయత్నం చేశారు వరల్డ్ లాంగ్వేజ్ ఇండెక్స్ నిపుణులు. సహజంగానే ప్రపంచ దేశాలన్నింటిలోను విస్తరించిన ఇంగ్లీష్ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది. మన జాతీయ భాష హిందీ పదో స్థానంలో నిలవడం గమనార్హం.

Survey: Out of 50 ATMs only one is working in Hyderabad?

అత్యంత శక్తివంతమైన భాషల జాబితాలో.. ఇంగ్లీష్ తర్వాత మాండరీన్ కు ద్వితీయ స్థానం దక్కగా.. ఫ్రెంచ్, స్పానిష్,రష్యన్,అరబిక్,జర్మన్,జపాన్,పోర్చుగీస్,హిందీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, ప్రపంచంలో ఆర్థికంగా బలమైన శక్తిగా ఉన్న నాలుగు దేశాల్లోను ఇంగ్లీషే అధికారిక భాష అన్న సంగతి తెలిసిందే.

ఇక బ్రిటీష్ పరిపాలనలో చాలా దేశాలకు ఇంగ్లీష్ విస్తరించడంతో.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ పరంగా ఇంగ్లీష్ కు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రపంచీకరణ కూడా తోడవడంతో ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషగా అవతరించింది. కాగా, 2050నాటికి ప్రపంచంలో శక్తివంతమైన భాషలుగా ఏయే భాషలు ఉండబోతున్నాయన్న అంశంపై కూడా నిపుణులు పరిశోధనలు జరిపారు.

ఇందులో తేలిందేంటంటే.. ప్రస్తుతం తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న ఇంగ్లీష్, మాండరీన్ విషయంలో ఏ మార్పు ఉండదు. ప్రస్తుతం పదో స్థానంలో హిందీ ఒక స్థానం మెరుగుపడి తొమ్మిదవ స్థానానికి, స్పానిష్ మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించారు. ఎకానమి, కమ్యూనికేషన్,నాలెడ్జ్,డిప్లమసీ అన్న కేటగిరీలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను అంచనా వేశారు.

English summary
English has been ranked first in the top 10 most powerful languages in the world according to the 2016 World Power Language Index (PLI).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X