వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి గర్వంగా ఫీలవుతోంది: అందుకు కారణం ఆమెనే.. కమలా హ్యారిస్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీల ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇటు అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య డిబెట్ జరుగుతోన్నాయి. అయితే ఇవాళ ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్, మైక్ పెన్స్ డిబేట్ హాట్ హాట్‌గా జరిగింది. చర్చ మధ్యలో తన తల్లిన కమలా హ్యారిస్ గుర్తుచేసుకున్నారు. తనను చూసి తల్లి గర్వపడుతుందని పేర్కొన్నారు.

తల్లి శ్యామలా గోపాలన్ హారిస్‌ను కమలా హ్యారిస్‌ను గుర్తు చేసుకున్నారు. అమ్మ గురించి ఆలోచిస్తున్నానని హ్యారిస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉండటం చూసి ఆమె గర్వపడుతుందన్నారు. ఇది నా తల్లికి గర్వకారణం అని ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవీకి పోటీచేసే స్థితికి చేరుకున్నానంటే.. దానికి కారణం అమ్మేనని తెలిపారు.

mother to be proud a daughter like me: kamala harris

19ఏళ్ల వయస్సులో ఆమె అమెరికాకు వచ్చారని తెలిపారు. 25 ఏళ్లు వచ్చేసరికి తనకు జన్మనిచ్చారని వెల్లడించారు. ఇవాళ తాను ఇక్కడ కూర్చొవడం ఆమెకు గర్వకారణంగా ఉంటుందని తెలిపారు. కమలా హారిస్ డిబేట్‌లో పాల్గొనడానికి కొన్ని గంటల ముందు ఆమె సోదరి మాయ హారిస్.. ట్విట్టర్‌లో తన తల్లి ఫొటోను పోస్ట్ చేశారు. అందులో కమలా హారిస్‌తోపాటు మాయ హారిస్ కూడా ఉన్నారు.

Recommended Video

US Election 2020 : Truump పై Kamala Harris ఉగ్రరూపం.. Mike Pence పై ఆధిపత్యం! || Oneindia Telugu

అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన కమలా హ్యరిస్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్య కరోనా వైరస్‌పై వాడీ వేడీ చర్చ బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. దీనికి మైక్ పెన్స్ కూడా ధీటుగానే బదులిచ్చారు. ట్రంప్‌పై హ్యారిస్ చేసిన ఆరోపణలకు భవిష్యత్‌లో వచ్చే వ్యాక్సిన్ చెంప పెట్టు అవుతోందని తెలిపారు. దీంతో ట్రంప్‌పై ప్రజలకు విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
mother to be proud a daughter like me kamala harris said in debate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X