వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గగనతలంలో అనూహ్య ఘటన: విమానం ప్రమాదంలో ఒక మహిళ మృతి

|
Google Oneindia TeluguNews

ఫిలడెల్ఫియా: డల్లాస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం-1380 అనుకోని ప్రమాదానికి గురైంది. సాంకేతిక కారణాలతో గగనతలంలోనే విమానం ఇంజన్ పేలిపోయింది. పేలిన ఇంజన్ శకలంలో విమానంలోకి దూసుకురావడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విమానంలోని మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

Plane

ప్రమాదం జరిగిన సమయంలో.. ఇంజన్ నుంచి లీకైన గ్యాస్ విమానంలోకి వచ్చి చేరడంతో.. ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు. దీంతో అందరికీ ఆక్సిజన్ మాస్కులు అందించినప్పటికీ.. దురదృష్టవశాత్తు జెన్నిఫర్ అనే ఓ మహిళ మృతి చెందారు. న్యూ మెక్సికో గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. వెల్స్ ఫార్గో బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.

నా భర్త చేతిని గట్టిగా పట్టుకున్నా:

'ప్రమాద సమయంలో నా భర్త చేతిని గట్టిగా పట్టుకుని, మనసులోనే దేవున్ని ప్రార్థించాను. నా పిల్లలను మళ్లీ చూస్తానో లేదో అని కలవరపడ్డాను.' అని ఓ ప్రయాణికురాలు వెల్లడించారు.

కాగా, విమానం 30,000 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఇంజన్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్‌ లీకైందని.. దానివల్లే ప్రయాణికులకు ఊపిరాడలేదని అన్నారు.

English summary
Shrapnel from a blown jet engine crashed through a window of a Southwest Airlines flight and caused such a perilous drop in air pressure that a passenger suffered fatal injuries after nearly being sucked outside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X