వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం, 30 మంది మృతి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్ భూకంపం అటు రాజధాని ఖాఠ్మండులోనే కాకుండా ఎల్లప్పుడూ పర్వతారోహకులతో కళకళలాడే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ఛిద్రం చేసింది. అసలు ఇది మౌంట్ ఎవరెస్టేనా అంటూ గుర్తు పట్టలేని విధంగా తయారైంది. భూకంపం దెబ్బకు మౌంట్ ఎవరెస్ట్ వద్ద ఉన్న టెంట్లు కూలిపోయి, విరిగిపడిన మంచు చరియలకు బేస్ క్యాంప్ ఆనవాళ్లే లేకుండా పోయింది. భూకంపం వల్ల మంచుచరియలు విరిగిపడటంతో దాదాపు 30 మంది పర్వతారోహకులు మృతి చెందారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కేందుకు వచ్చినా ఎంతో మంది విదేశీయులకు ఎవరెస్ట్ శిఖరం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద విరిగిపడ్డ మంచుచరియల శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. పర్వతారోహకులను రక్షించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్లు ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్దకు చేరుకుంటున్నాయి. ప్రాణాలతో బయటపడిన పర్వతారోహకులను ప్రత్యేక హెలికాఫ్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మౌంట్ ఎవరెస్ట్ విశేషాలు:

* 29, 035 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వతం

* టిబెట్, నేపాల్ దేశాల సరిహద్దుగా మౌంట్ ఎవరెస్ట్ ఉంది.

* 1856వ సంవత్సరంలో సర్వేయర్ సర్ జార్జి ఎవరెస్ట్ పేరు మీదగా దానికి ఆ పేరు వచ్చింది.

* 1953 సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్‌పై తొలి పర్వాతారోహణ జరిగింది.

* గతంలో 2014న మౌంట్ ఎవరెస్ట్ వద్ద 16 మంది పర్వాతారోహకులు మరణించారు.

* ఎవరెస్ట్ చరిత్రలో గత వారం జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఈ భూకంప ప్రమాదంలో 30 మంది వరకు మృతి చెందారు.

* మరణించిన వారిలో నలుగురు అమెరికా జాతీయులున్నట్లు సమాచారం.

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

నేపాల్ భూకంపం అటు రాజధాని ఖాఠ్మండులోనే కాకుండా ఎల్లప్పుడూ పర్వతారోహకులతో కళకళలాడే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ఛిద్రం చేసింది. అసలు ఇది మౌంట్ ఎవరెస్టేనా అంటూ గుర్తు పట్టలేని విధంగా తయారైంది.

 మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

భూకంపం దెబ్బకు మౌంట్ ఎవరెస్ట్ వద్ద ఉన్న టెంట్లు కూలిపోయి, విరిగిపడిన మంచు చరియలకు బేస్ క్యాంప్ ఆనవాళ్లే లేకుండా పోయింది. భూకంపం వల్ల మంచుచరియలు విరిగిపడటంతో దాదాపు 30 మంది పర్వతారోహకులు మృతి చెందారు.

 మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కేందుకు వచ్చినా ఎంతో మంది విదేశీయులకు ఎవరెస్ట్ శిఖరం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద విరిగిపడ్డ మంచుచరియల శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది.

 మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

పర్వతారోహకులను రక్షించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్లు ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్దకు చేరుకుంటున్నాయి. ప్రాణాలతో బయటపడిన పర్వతారోహకులను ప్రత్యేక హెలికాఫ్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

మౌంట్ ఎవరెస్ట్ వద్ద నేపాల్ భూకంపం మిగిల్చిన విషాదం

గతంలో 2014న మౌంట్ ఎవరెస్ట్ వద్ద 16 మంది పర్వాతారోహకులు మరణించారు. ఎవరెస్ట్ చరిత్రలో గత వారం జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఈ భూకంప ప్రమాదంలో 30 మంది వరకు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు అమెరికా జాతీయులున్నట్లు సమాచారం.

English summary
Mount Everest — Flying over Mount Everest base camp, a wide track of snow covers where tents once stood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X