వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా-క్యూబా: కష్టపడి ఒబామా కలిపితే... ట్రంప్ అవలీలగా తెంచేశారు

దాదాపు ఐదు దశాబ్దాలుగా అంటీముట్టనట్లుగా ఉన్న అమెరికా, క్యూబాలు అలా కలిశాయో లేదో.. ఇలా విడిపోతున్నాయి. క్యూబాతో కటిఫ్ కు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: దాదాపు ఐదు దశాబ్దాలుగా అంటీముట్టనట్లుగా ఉన్న అమెరికా, క్యూబాలు అలా కలిశాయో లేదో.. ఇలా విడిపోతున్నాయి. క్యూబాతో కటిఫ్ కు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా, క్యూబాల మధ్య స్నేహపూరిత వాతావరణం తీసుకొచ్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎంతో కృషి చేశారు. విభేదాలు విడనాడి పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా 2014లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

Moving to Scuttle Obama Legacy, Donald Trump to Crack Down on Cuba

ఫలితంగా 2015 జులై నుంచి రెండు దేశాల నడుమ స్నేహపూరిత వాతావరణం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాలకు మంగళం పాడాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారట. ఇదే గనుక జరిగితే ఇరు దేశాల వ్యాపార సంబంధాలపైనా ప్రభావం పడుతుంది.

అమెరికా నుంచి క్యూబాకు వెళ్లేందుకు సంబంధించిన నిబంధనలను కఠితరం చేసేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారని విశ్వసనీయం వర్గాల సమాచారం. అమెరికన్‌ కంపెనీలు క్యూబా మిలటరీ నియంత్రణలో ఉన్న సంస్థలలో వ్యాపారాలు సాగించకుండా కట్టడి చేయాలని ఆయన భావిస్తున్నారట.

ఈ నిబంధనలకు సంబంధించిన వివరాలను శుక్రవారం మియామీలో ట్రంప్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే క్యూబాకు అమెరికా నుంచి పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

English summary
President Trump on Friday will move to halt the historic rapprochement between the United States and Cuba set in motion by former President Barack Obama, delivering a speech in Miami in which he plans to announce he is clamping down on travel and commercial ties with the island nation to force the government of Raúl Castro to change its repressive ways. Mr. Trump is expected to declare that the two-year-old Obama-era approach of engagement had amounted to a failed policy of appeasement. To that end, he plans to outline stiffer rules for American travelers visiting Cuba and a sweeping prohibition against transactions with companies controlled by the military, which runs vast swaths of the hotel and tourism sector, according to White House officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X