వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#MrVicePresidentImSpeaking: సోషల్ మీడియాలో కమలా హ్యరిస్ కామెంట్స్ ట్రెండ్..

|
Google Oneindia TeluguNews

అమెరికా ట్విట్టర్‌లో #MrVicePresidentImSpeaking హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎందుకీలా ట్రెండ్ అవుతుందో తెలసా..? ఇటీవల రిపబ్లిక్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులు.. కమలా హ్యారిస్, మైక్ పెన్స్ మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో కమలా హ్యారిస్ తన వాదనలను బలంగా వినిపించారు. అయితే మైక్ పెన్స్ పదే పదే అడ్డురావడంతో మిస్టర్ వైస్ ప్రెసిడెంట్ ఐయామ్ స్పీకింగ్ అని అన్నారు. దీనిని డెమోక్రటిక్ మద్దతుదారులు ట్వీట్ చేశారు. దీంతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

మైక్ పెన్స్‌ని నిలువరిండచడం కోసం కమలా హారిస్ ఉపయోగించిన మరికొన్ని పదాలు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. కమలా హారిస్ వాడిన పదాలు యూఎస్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ముఖాముఖి సందర్భంగా కమలా హారిస్.. తన వాదనలు వినిపించారు. డొనాల్డ్ ట్రంప్ వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు.

#MrVicePresidentImSpeaking: kamala harris comments trend on social media

మైక్స్ పెన్స్.. హ్యరిస్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు. దాంతో స్పందించిన కమలా హారిస్.. 'మిస్టర్ వైస్ ప్రెసిడెంట్ ఐయామ్ స్పీకింగ్' అంటూ మైక్స్ పెన్స్ నోరు మూయించారు. ఈ క్రమంలో డెమొక్రటిక్ మద్దతుదారులు #MrVicePresidentImSpeaking‌తో ట్వీట్ల వర్షం కురిపించారు. దీంతో ఈ హ్యష్‌ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన కమలా హ్యరిస్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్య కరోనా వైరస్‌పై వాడీ వేడీ చర్చ బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. దీనికి మైక్ పెన్స్ కూడా ధీటుగానే బదులిచ్చారు. ట్రంప్‌పై హ్యారిస్ చేసిన ఆరోపణలకు భవిష్యత్‌లో వచ్చే వ్యాక్సిన్ చెంప పెట్టు అవుతోందని తెలిపారు. దీంతో ట్రంప్‌పై ప్రజలకు విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
#MrVicePresidentImSpeaking: democratic vice president candidate kamala harris comments trend on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X