• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవును..జిహాదీలకు మా దేశంలోనే శిక్షణ: ఇప్పుడు మమ్మల్నే కాటేస్తున్నాయి: పాక్ ప్రధాని అంగీకారం!

|

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు విచ్చలవిడిగా వెలిశాయని, జమ్మూ కాశ్మీర్ లో భారత సరిహద్దుల వెంబడి ఉన్న పర్వత శ్రేణుల్లో ఉగ్రవాదులు, ఆత్మాహూతి దళాలకు శిక్షణ ఇస్తున్నారంటూ ఇన్నాళ్లూ మనదేశం ఎన్నిసార్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా.. అడ్డంగా తల ఊపుతూ వచ్చింది పాకిస్తాన్. భారత్ ఆరోపణలన్నీ నిరాధారమని వాదిస్తూ వచ్చింది. నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లు.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రే అంగీకరించారు. ముజాహిదీన్లు, జిహాదీలకు తమ దేశంలోనే విస్తృతంగా శిక్షణ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆ జిహాదీలు, ముజాహిదీన్లు తమకే ఎసరు పెడుతున్నాయని అన్నారు.

అర్థాన్నే మర్చేసేలా! కాశ్మీర్ పునర్విభజన చట్టంలో అనేక తప్పులు!

సోవియట్ కు వ్యతిరేకంగా

సోవియట్ రష్యా కూటమికి వ్యతిరేకంగా ఆత్మాహూతి దళాలకు మారణ హోమాన్ని సృష్టించేలా జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరుతో తమ దేశంలోనే శిక్షణ ఇచ్చారని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో భూభాగాన్ని బలవంతంగా ఆక్రమించిన సోవియట్ సైన్యంపై దాడులకు పాల్పడి భయోత్పాతాన్ని సృష్టించాడానికే అప్పట్లో ఈ శిక్షణా శిబిరాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. శిక్షణ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ అమెరికా భరించిందని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పెద్ద ఎత్తున ఉగ్రవాద శిబిరాలకు నిధులను పంపించేవని అన్నారు. శుక్రవారం ఇస్లామాబాద్ లో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆయా వివరాలను వెల్లడించారు.

తటస్థంగా ఉండలేకపోయాం:

ఆప్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సైనిక బలగాలు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు పాకిస్తాన్ తటస్థంగా ఉండాల్సిందని అన్నారు. తటస్థంగా లేకపోవడం వల్ల అన్నీ అనర్థాలే ఎదురయ్యాయని చెప్పారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా సైన్యానికి మద్దతు పలకాల్సి వచ్చిందని, దాని దుష్పరిణామాలను ఇప్పుడు చవి చూస్తున్నామని చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిల్చోవడం వల్ల అటు అగ్రరాజ్యానికి, ఇటు ముజాహిదీన్లు, జిహాదీలకు లక్ష్యంగా మారామని అన్నారు. ఫలితంగా- స్వదేశంపైనే వారు విధ్వేషాన్ని పెంచుకున్నారని అన్నారు.

అన్ని విధాలుగా నష్టపోయాం

అన్ని విధాలుగా నష్టపోయాం

అమెరికాకు చెందిన సైనిక బలగాలు తాలిబన్లను మట్టుబెట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించిన సందర్భంగా తాము తటస్థ వైఖరిని అనుసరించలేదని, దానివల్ల అన్ని విధాలుగా నష్టపోయామని అన్నారు. దశాబ్దకాలంగా 70 వేల మంది పాకిస్తానీయులు అకారణంగా, అర్ధాంతరంగా మరణించారని చెప్పారు. ముజాహిదీన్లు, జిహాదీలు నిర్వహించిన దాడుల వల్ల పాకిస్తానీయుల జీవనం కకావికలమైందని అన్నారు. దేశ ఆర్థికరంగంపైనా అది పెను ప్రభావం చూపిందని అన్నారు. 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక వనరులు, ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. తమ దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి అమెరికానే కారణమనే ఆగ్రహం ప్రతి పాకిస్తానీయుడిలో వ్యక్తమౌతోందని అన్నారు.

English summary
Pakistan Prime Minister Imran Khan on Friday admitted the fact that his country had in 1980 trained Mujahideens to fight the Soviets in Afghanistan. “In 80s we were training these Mujahideen people to do jihad against Soviet when they occupied Afghanistan. So, these people were trained by Pakistan, and funded by the US’s CIA,” Khan was quoted as saying by news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more