వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హెచ్1బీ వీసా కోసం వేర్వేరు దరఖాస్తులకు అనుమతి లేదు’: తేల్చేసిన యూఎస్‌సీఐఎస్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలో ఉద్యోగాల కోసం విదేశీయులకు అందించే వీసాల జారీపై నియంత్రణ ప్రారంభించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వీటి నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

హెచ్‌1బీ వీసాల జారీకి నిర్వహించే లాటరీలో తమ పేరును ఎలాగైనా పొందేందుకు ఒకే వ్యక్తి ఒకటికంటే ఎక్కువ దరఖాస్తు ఫారాలు దాఖలు చేయడంపై నియంత్రణకు సిద్దమైంది.

వేర్వేరు దరఖాస్తుల తిరస్కరణ

వేర్వేరు దరఖాస్తుల తిరస్కరణ

ఈమేరకు అమెరికా పౌరసత్వం వలసదారుల సేవల సంస్థ(యుఎస్‌సీఐఎస్‌) చట్టబద్ధంగా ఏదైనా వ్యాపార అవసరముంటే తప్ప ఒకే పేరు మీద దాఖలయ్యే వేర్వేరు దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. అలాంటి దరఖాస్తులపై క్షుణ్ణంగా తనిఖీ ఉంటుందని తెలిపింది.

ఊహాజనిత ఉద్యోగ ప్రక్రియకు అనుమతి లేదు

ఊహాజనిత ఉద్యోగ ప్రక్రియకు అనుమతి లేదు

ఒకే వ్యక్తి అనేక దరఖాస్తులను దాఖలు చేయడం లాటరీ ప్రక్రియ స్ఫూర్తినే దెబ్బతీస్తుందని యుఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. హెచ్‌1బీ వీసా కార్యక్రమం ఊహాజనిత ఉద్యోగ ప్రక్రియను అనుమతించదని స్పష్టం చేసింది. 2019 ఆర్థిక సంవత్సరం హెచ్‌1బీ వీసాలకు ఏప్రిల్‌ 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతున్న వేళ అమెరికా తాజా నిర్ణయం తీసుకుంది.

భద్రత ముప్పు నివారణకే

భద్రత ముప్పు నివారణకే

తమ దేశంలో ప్రవేశించే వారికి సాధారణ వీసా ప్రక్రియను కూడా కఠినతరం చేసేలా అమెరికా నిబంధనలు రూపొందించేందుకు సిద్ధమైంది. అమెరికా భద్రతకు ఎదురయ్యే ముప్పును నివారించే చర్యల్లో భాగంగా వీసా దరఖాస్తు దారులు గత ఐదేళ్లలో ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ చిరునామా, సామాజిక మాధ్యమాల చరిత్రను సమర్పించాలని స్పష్టం చేసింది.

దరఖాస్తు ఫారంలోనే అన్ని..

దరఖాస్తు ఫారంలోనే అన్ని..

ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో ఓ డాక్యుమెంట్‌ను పోస్టు చేసింది. దీని ప్రకారం ఏ విదేశం నుంచైనా తమను బలవంతంగా పంపించడం, కుటుంబ సభ్యులకు తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాల వంటి ప్రశ్నలకు కూడా దరఖాస్తు ఫారంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలపై అమెరికా ప్రభుత్వం 60 రోజుల పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.

English summary
Multiple H-1B applications will lead to rejection of the petitions, a federal American agency has warned foreign workers, days ahead of the initiation of filing process for the non-immigrant visa, popular among Indian techies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X