వైట్‌హౌస్‌కు సమీపంలో వాషింగ్టన్ డీసీలో కాల్పులు, పలువురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్ వాషింగ్టన్ డీసీ కొలంబియా హైట్స్‌లో నలుగురిని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనా స్థలి నుంచి బాధితులను తీసుకెళ్తున్న అంబులెన్స్ చిత్రాలను స్థానిక WJLA-TV సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
కొలంబియా రోడ్డు ఎన్డబ్ల్యులోని 1300 బ్లాక్‌లో కాల్పులు జరిపారని, ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పలు వీధుల్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన వైట్ హౌస్‌కు సమీపంలో చోటు చేసుకున్నట్లుగా సమాచారం. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
ఈ కాల్పులు రాత్రి గం.10.06కి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విచారణ నిమిత్తం పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ దారిలో రోడ్లను క్లోజ్ చేశారు. దాదాపు నెల రోజుల క్రితం టెక్సాస్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు.