వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా నియంత కిమ్‌ మరణించారా? అవునంటోన్న చైనా, జపాన్ మీడియా.. ప్రత్యేక కథనాలు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జొంగ్ ఉన్ మరణించారా?
అవుననే సమాధానం ఇస్తోంది చైనా మీడియా. చైనా ఆర్థిక రాజధాని హాంగ్‌కాంగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న హెచ్‌కేఎస్‌టీవీ హాంగ్‌కాంగ్ శాటిలైట్ టెలివిజన్ ఛానల్.. కిమ్‌జొంగ్ మరణించాడని వెల్లడించింది. ఉత్తర కొరియాకు చెందిన అత్యున్నత అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి కిమ్ కన్నుమూశారని పేర్కొంది. ఇదే విషయాన్ని చైనా టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో పోస్ట్ చేశారు.

Recommended Video

#KimJongUn : Kim Jong Un Is No More ? Why North Korea Is So Silent On The News ?

ఈ శాటిలైట్ టీవీ వైస్ డైరెక్టర్ షిజియాన్ గ్జిన్గ్‌ఝౌ ఈ విషయాన్ని వెల్లడించారు. షిజియాన్..చైనా విదేశాంగ మంత్రికి దగ్గరి బంధువు కావడం వల్ల ఆమె వెల్లడించిన ఈ సమాచారం నిజమే అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జపాన్‌కు చెందిన షుకాన్ జెండల్ అనే మేగజైన్ కూడా కిమ్ వెజిటేటివ్ స్థాయిలో ఉన్నారని పేర్కొంది. కిమ్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా దిగజారిందనే కారణంతో చైనా ఓ ప్రత్యేకంగా డాక్టర్ల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన మరణించినట్లు అదే దేశానికి చెందిన మీడియా వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరింత బలం చేకూర్చినట్టుగా

మరింత బలం చేకూర్చినట్టుగా

ఉత్తర కొరియాకు చెందిన మీడియా ఒకటి కిమ్‌పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడం ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చినట్టుగా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వార్తలను అందించే ఆ మీడియా.. ఇదివరకు కిమ్ సాధించిన లక్ష్యాలు, కొన్ని కొటేషన్లతో కూడిన ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అటు సోషల్ మీడియా కూడా కిమ్‌జొంగ్ మరణించే ఉంటారనే అభిప్రాయానికి వచ్చింది.

నెటిజన్లు.. ట్విట్టరెటీలు

నెటిజన్లు.. ట్విట్టరెటీలు

చైనా, జపాన్ మీడియాల్లో వెల్లడైన కథనాలు ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నాయి. కిమ్‌జొంగ్ మరణాించి ఉండొచ్చంటూ నిర్ణయానికి వచ్చేశారు నెటిజన్లు.. ట్విట్టరెటీలు. #KIMJONGUNDEAD, #North Korea అనే పేర్లు ట్విట్టర్‌లో పోటెత్తుతున్నాయి. ఆధునిక నియంత మరణించాడనే విషయంపై వేలకొద్దీ ట్వీట్లు వెలువడుతున్నాయి. మెమెలు తయారవుతున్నాయి. కిమ్ జీవించే ఉన్నారా? లేక మీడియా చెబుతున్నట్లుగా కన్నుమూశారా? అనే వార్తలపై ఉత్తర కొరియా ప్రభుత్వం స్పందించలేదు. కిమ్ మరణించారనే వార్తలను ధృవీకరించట్లేదు.. అలాగనీ తోసిపుచ్చనూ లేదు.

ఆరోగ్యంపై అనుమానాలు

ఆరోగ్యంపై అనుమానాలు

36 సంవత్సరాల వయస్సు ఉన్న కిమ్‌జొంగ్.. ఈ నెల 11వ తేదీ నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీన ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత జయంత్యుత్సవాలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఉత్తర కొరియా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకొనే ఆ కార్యక్రమానికి కిమ్ హాజరు కాకపోవడంతోనే ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమౌతూ వచ్చాయి. ఈ నెల 12వ తేదీన ఆయన గుండెకు సర్జరీ చేయించకున్నారని, అది కాస్తా తిరగబెట్టిందనే వార్తలు వెలువడ్డాయి. పరిస్థితి విషమించడంతో చైనా ఓ డాక్టర్ల బృందాన్ని హుటాహుటిన ఉత్తర కొరియాకు పంపించింది.

English summary
Social media is abuzz with speculations over Kim Jong Un's alleged death after a senior official at a Beijing-backed satellite TV channel made the claim on Weibo. Vice director of Hong Kong Satellite Television Shijian Xingzou reportedly stated on her Weibo account, citing top level sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X