వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండె సమస్యతో హుటాహుటిన ఆస్పత్రికి ముషార్రఫ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Musharraf
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ హుటాహుటిన అస్పత్రికి వెళ్లారు. గుండె సంబంధమైన సమస్య తలెత్తడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. కోర్టులో విచారణకు వస్తూ మధ్యలో గుండె సమస్య తలెత్తడంతో అటు నుంచి అటే ఆస్పత్రికి వెళ్లినట్లు ముషార్రఫ్ అనుచరుడు చెప్పారు.

భద్రతా కారణాలు చూపి గత రెండు సెషన్స్‌కు పర్వేజ్ ముషార్రఫ్ కోర్టుకు రాలేదు. దాంతో 70 ఏళ్ల ముషార్రఫ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. భారీ భద్రత మధ్య కోర్టుకు తీసుకుని వస్తుండగా ముషార్రఫ్ అనారోగ్యానికి గురయ్యారని ఓ సీనియర్ పోలీసు అధికారి జాన్ మొహమ్మద్ కోర్టుకు చెప్పారు.

గుండె సంబంధమైన సమస్య తలెత్తడంతో ముషార్రఫ్‌ను సైనిక బలగాల కార్డియోలజీ సంస్థకు తరలించారు. ముషార్రఫ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అంటున్నారు.

ముషార్రఫ్ 1999 నుంచి 2008 వరకు సాగించిన తన పాలనలోని పలు వ్యవహారాలకు కేసులను ఎదుర్కుంటున్నారు.

English summary
Pakistan's former military ruler Pervez Musharraf was rushed to hospital on Thursday after suffering a "heart problem" on his way to court for a hearing in his trial for treason, police and an aide said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X