వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిలిప్పీన్స్ లో రామాయ‌ణ నృత్యాన్ని వీక్షించిన మోడీ, ట్రంప్, షింజో

‘మహారదియా లవాన’ అంటే ఏమిటో తెలుసా? మన భాషలో ‘రామాయణం’. మరి ఇదెవరి భాష అంటారా? ఫిలిప్పీన్స్ భాష. అవును, మన రామాయణాన్ని వారి భాషలో అలాగే పిలుచుకుంటారు .

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మనీలా: 'మహారదియా లవాన' అంటే ఏమిటో తెలుసా? మన భాషలో 'రామాయణం'. మరి ఇదెవరి భాష అంటారా? ఫిలిప్పీన్స్ భాష. అవును, మన రామాయణాన్ని వారి భాషలో అలాగే పిలుచుకుంటారు .

అంతేకాదు, మన రామాయణ గాథను ఆధారం చేసుకుని ఫిలిప్పీన్స్ వాసులు 'సింగ్‌కిల్' అనే నృత్యరూపకాన్ని రూపొందించుకున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం.

Musical play based on Ramayana enthralls leaders at ASEAN opening ceremony

మన ప్రధాని మోడీ ఫిలిప్పీన్స్ రాజ‌ధాని మ‌నీలాలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆసియాన్ స‌ద‌స్సు స్వర్ణోత్సవాలు జ‌రుగుతోన్న‌ నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనీస్‌ ప్రధాని లీ కెఖియాంగ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోన్న రామాయ‌ణాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌తో క‌లిసి మోడీ, షింజో అబే తిల‌కించారు. భారతీయ సంస్కృతిని ప్ర‌తిబింబిస్తూ వేదికపై వేసిన ఆ ప్ర‌ద‌ర్శ‌నలు అంద‌రినీ అల‌రించాయి. రెండు రోజులు జరిగే ఆసియాన్‌ సదస్సు ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ఈ వేడుక‌ను నిర్వ‌హించారు.

English summary
A musical performance based on the epic Ramayana on Monday drew loud applause from several world leaders and delegates at a grand opening ceremony of the two-day ASEAN (Association of Southeast Asian Nations) Summit summit. The play reflected India’s cultural linkages with the Philippines and several member countries of the 10-member powerful bloc.Prime Minister Narendra Modi, US President Donald Trump, Chinese Premier Li Keqiang, Japanese Prime Minister Shinzo Abe and several other leaders from ASEAN’s partner countries attended the glitzy opening ceremony at the highly fortified Cultural Centre in this bustling metropolis. The Ramayana in the Philippines is called ‘Maharadia Lawana’ which means king Ravana. The Philippines’ famous dance is called ‘Singkil’ which is based on the Ramayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X