• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుహలోని వారిని కాపాడేందుకు మినీ సబ్‌మెరైన్.. అద్భుతం: ఒళ్లు గగుర్పొరిచే సాహసం (వీడియోలు)

By Srinivas
|

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం పన్నెండు గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో కొందరిని బయటకు తీసుకు వచ్చారు. కోచ్‌తో పాటు మిగతా వారిని తీసుకు వచ్చేందుకు రెండో దఫా ఆపరేషన్ ప్రారంభించనున్నారు. తొలిసారి కాపాడిన వారిని మొదట ఆరుగురిగా భావించినప్పటికీ, నలుగురిని మాత్రమే తీసుకు వచ్చారు. ఆ తర్వాత మరికొందరిని కాపాడారు. సోమవారం సాయంత్రం వరకు ఏడుగురిని రక్షించారు. ఐదుగురు చిన్నారు, కోచ్ గుహలోనే ఉన్నారు.

గుహ నుంచి బయటపడ్డ 6గురు: పెద్ద సాహసమే.. ఎలా బయటకొచ్చారంటే? గుహ నుంచి బయటపడ్డ 6గురు: పెద్ద సాహసమే.. ఎలా బయటకొచ్చారంటే?

వీరి ఆపరేషన్‌కు సాయంగా టెక్ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ఓ మినీ సబ్ మెరైన్‌ను రూపొందించారు. లాస్ ఏంజిల్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో దీనిని పరీక్షించిన వీడియో ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. బహుషా ఇది థాయ్ కేవ్ ఆపరేషన్‌కు ఉపయోగపడుతుందనుకుంటా అని పేర్కొన్నారు.

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 13మంది: ఎన్నెన్నో ఆలోచనలుథాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 13మంది: ఎన్నెన్నో ఆలోచనలు

సబ్ మెరైన్‌ను పోలి ఉండే మినీ సబ్ మెరైన్

గుహలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఈ చిన్న సైజు సబ్ మెరైన్‌ ఉపయోగపడనుంది. ఎలాన్ తెలిపిన సమయం ప్రకారం ఇది ఇప్పటికే థాయ్‌లాండ్‌కు చేరి ఉంటుంది. రక్షణదళాలు ఉపయోగించే సబ్ మెరైన్‌ను పోలి ఉండే ఈ మినీ సబ్‌మెరైన్‌ ద్వారా ఆక్సిజన్‌, ఆహారం తీసుకెళ్లడంతో పాటు దీని సహాయంతో నీటీ నుంచి సులవుగా బయటకు రావచ్చు.

అందర్నీ తీసుకు రావడానికి సమయం

అందర్నీ తీసుకు రావడానికి సమయం

థాయ్‌లాండ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం పది గంటలకు తొలి సహాయకచర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో మిగిలిన వారిని ఈ రోజుకు వాయిదా వేశారు. ముందుగా ఆరోగ్యంగా ఉన్న బాలలను బయటకు తీసుకొచ్చామని, మిగిలినవారినీ సోమవారం రక్షిస్తామని అధికారులు తెలిపారు. జూన్‌ 23న థాయిలాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహను చూడటానికి వెళ్లి 12 మంది బాలలు, కోచ్‌ అందులో చిక్కుకుపోయారి. మొత్తం అందర్నీ బయటకు తీసుకురావడానికి రెండు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశముందని భావిస్తున్నారు.

ఒక్కర్ని రక్షించేందుకు ఇద్దరు చొప్పున

వరద ఉద్ధృతి, వాతావరణం ప్రభావం చూపే అవకాశాన్ని బట్టి సహాయక చర్యలు ఉంటాయని చెప్పారు. తొలి విడత సహాయక చర్యల్లో 13 మంది విదేశీ, ఐదుగురు థాయిలాండ్‌ గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. ప్రతి బాలుడిని కాపాడటానికి ఇద్దరేసి చొప్పున సహకరించారు. చిమ్మచీకటిలో, బురదనీటిలో ప్రవాహవేగాన్ని తట్టుకుని బాలలను తీసుకురావడం కత్తి మీద సాములా నడిచింది. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతుండటం ఆందోళనను పెంచుతోందని థాయిలాండ్‌ నావికాదళానికి చెందిన సీల్స్‌ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ సాహసం చూస్తే ఒళ్లు గగుర్పొరిచేలా ఉంది.

గుహ నుంచి బయటకు వచ్చిన వివరాలు చెప్పలేదు

గుహ నుంచి సురక్షితంగా బయటపడిన వారు తల్లిదండ్రులను కలిసే అవకాశముంది. బయటకు రాగానే బాలురను ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యాన్ని పరిశీలించారు. చిన్నారులు ఆరోగ్యంగానే ఉన్నారు. కోలుకుంటున్నారు. సోమవారం సాయంత్రానికి వారి తల్లిదండ్రులు పిల్లల్ని కలిసే ఏర్పాటు చేయనున్నారు. గుహ నుంచి బయటకు వచ్చిన చిన్నారులు వివరాలు చెప్పలేదని తెలుస్తోంది.

చిమ్మచీకటిలో, బురద నీటి వేగాన్ని తట్టుకొని రావడం కష్టంగానే

చిమ్మచీకటిలో, బురద నీటి వేగాన్ని తట్టుకొని రావడం కష్టంగానే

ఇదిలా ఉండగా, సోమవారం సహాయక చర్యలకు భారీ వర్షాలు అడ్డుగా మారాయి. సహాయక చర్యలను నిలిపేశారు. వర్షం భారీగా కురుస్తుంటే ప్రమాదం జరగొచ్చనే భయంతో సిబ్బంది సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి వాతావరణం అనుకూలించగానే సహాయక చర్యలను ప్రారంభించనున్నారు. సహాయక చర్యల్లో విదేశీ, థాయ్ గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు. ఒక్క బాలుడికి ఇద్దరేసి చొప్పున సహకరించారు. చిమ్మచీకటిలో బురదనీటి ప్రవాహవేగాన్ని తట్టుకుని చిన్నారులను బయటకు తీసుకురావడం చాలా కష్టంగా మారింది.

English summary
American tech entrepreneur Elon Musk has proposed a mini-submarine to save the boys trapped inside a flooded Thai cave, floating the idea on social media while linking it to his space exploration business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X