వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు శ్రీలంక ముస్లిం గవర్నర్లు రాజీనామ..! తీవ్రవాదులతో సంబంధాలంటూ ప్రజల ఒత్తిడి...

|
Google Oneindia TeluguNews

శ్రీలంక బాంబు పేలుళ్ల ప్రభావం దేశంలో ఉన్నత స్థాయి వ్యక్తులపై కూడ పడింది. ఇప్పటికే శ్రీలంక లోని ముస్లింలు మరియు స్థానిక బుద్దిస్టుల మధ్య వివావాదాలు చెలరేగుతున్నాయి. ఈనేపథ్యంలోనే లంక బాంబు పేలుళ్ల ప్రభావం అక్కడి అధికార వ్యవస్థపై కూడ పడింది. దీంతో శ్రీలంకలోని గవర్నలకు శ్రీలంక బాంబు పెలుళ్లకు పాల్పడిన తీవ్రవాదులకు మద్దతు పలుకుతున్నారంటూ స్థానిక ప్రజలు, అక్కడి బౌద్దమతానికి చెందిన వేలాది మంది వారి రాజీనామాపై ఆందోళనలను నిర్వహించారు. దీంతో ఇద్దరు ముస్లీం గవర్నలు రాజీనామ చేశారు.

శ్రీలంకలో ఓ వర్గానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

శ్రీలంకలో ఓ వర్గానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి 250 మందికి పైగా మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే శ్రీలంకలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ కూడ విధించిన పరిస్థితి. అయితే తాజగా పరిస్థితులు కొంత మెరుగు పడుతున్నాయనే నేపథ్యంలో మరోసారి ఆందోళనలు బయటపడ్డాయి.

 గవర్నర్లకు తీవ్రవాదులతో సంబంధాలు

గవర్నర్లకు తీవ్రవాదులతో సంబంధాలు

తాజాగా శ్రీలంక ప్రభుత్వమే నియమించిన ఇద్దరు ముస్లిం గవర్నర్‌లు రాజనామ చేశారు. దక్షిన ప్రావిన్న్ గవర్నర్ అయిన అజాత్ సాలే తోపాటు ఈశన్య ప్రావిన్స్ గవర్నర్‌గా ఉన్న హిస్బుల్లాలు తీవ్రవాదులకు సహకరిస్తున్నరంటూ పార్లమెంట్ సభ్యుడైన అతురాలియా రత్హ్నా బుద్దిస్టు మందిరం వద్ద గత నాలుగు రోజులుగా అమరణ నిరహార దీక్షకు కూర్చుకున్నారు. దీంతోపాటు ఆయనకు మద్దతుగా గవర్నర్లు రాజీనామ చేయాలంటూ వేలదీ మంది ప్రజలతోపాటు స్థానిక బౌద్దులు ఆందోళన నిర్వహించారు.

అధ్యక్షుడికి రాజీనామాలు ఇచ్చిన ఇద్దరు గవర్నర్లు

అధ్యక్షుడికి రాజీనామాలు ఇచ్చిన ఇద్దరు గవర్నర్లు

దీంతో రాజీనామపై ప్రజల నుండి ఆందోళనలను ఉదృతం కావడంతో గవర్నలు తమ రాజీనామాను శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనకు అందించారు.కాగా రాజీనామ చేసిన గవర్నర్లు ప్రజలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. వారు ఆరోపిస్తున్నట్టు తమకు తీవ్రవాదులతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

10వేల మంది బుద్దిస్టుల ర్యాలీ

10వేల మంది బుద్దిస్టుల ర్యాలీ

ఇక రాజీనామ చేయాలంటూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు అతురాలియా కూడ తన దీక్షను విరమించాడు. ఈనేపథ్యంలోనే సుమారు 10వేల మంది బుద్దిస్టులు ఉదయం ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
మరో వైపు దేశ వ్యాప్తంగా అతురాలియాకు పలువురు మద్దతు తెలిపారు.

English summary
Two Muslim governors in Sri Lanka resigned on Monday after thousands of people, including majority Buddhist community monks, launched a protest in the pilgrim city of Kandy, demanding their sacking for allegedly supporting Islamist extremists responsible for the Easter suicide bombings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X