వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CAAపై ఐక్యరాజ్యసమితి : ముస్లిం సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ప్రకటన

|
Google Oneindia TeluguNews

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Coronavirus | YCP MLA Roja Slams Chandrababu

ఐక్యరాజ్యసమితి: భారత పౌరసత్వ సవరణ చట్టంపై గత కొద్దిరోజులుగా ఆందోళనలు నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ కొత్త చట్టంతో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి కూడా ఒక లెజిస్లేటివ్ రిపోర్టును విడుదల చేసింది.

ముస్లిం సామాజిక వర్గంపై ప్రభావం

ముస్లిం సామాజిక వర్గంపై ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు ఈ రెండూ బీజేపీకి ప్రాణధారమైన హిందూత్వ భావజాలం నుంచే పుట్టుకొచ్చాయని ఐక్యరాజ్యసమితి భావించింది. అంతేకాదు ముస్లిం సామాజిక వర్గం వారికి దేశంలో ఉండేందుకు చోటు దక్కకపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది.

ఫ్యాక్ట్‌షీట్‌లో అనేక అంశాలను ప్రస్తావించిన యూఎన్

ఫ్యాక్ట్‌షీట్‌లో అనేక అంశాలను ప్రస్తావించిన యూఎన్

పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ముస్లిం సామాజిక వర్గం వారిని ఎన్‌ఆర్‌సీ నుంచి తొలగించడం జరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు వీరు ఉండేందుకు చోటు లభించకపోవచ్చని లేదా సుదీర్ఘంగా నిర్బంధంలో ఉంచే అవకాశం ఉందని సీఏఏపై ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (USCIRF)విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో పొందుపర్చింది. అంతేకాదు బీజేపీ నేతలు ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటలను కూడా ఈ నివేదికలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ పొందుపర్చింది. భారత్ నుంచి ముస్లింల పేర్లను తొలగించాలన్న మాటలు బీజేపీ నేతలు మాట్లాడిన వివరాలను పొందుపర్చింది.

2005లో యోగీ వ్యాఖ్యలను కోట్ చేసిన యూఎన్

2005లో యోగీ వ్యాఖ్యలను కోట్ చేసిన యూఎన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చే మూడు రోజుల ముందు అమెరికా కాంగ్రెస్ సభ్యులు అమిబెరా, జార్జ్ హోల్డింగ్‌లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్ శ్రింగ్లాను బుధవారం కలిసి ఐక్యరాజ్య సమితి పొందుపర్చిన ఫ్యాక్ట్ షీట్ గురించి చర్చించారు. అంతేకాదు ప్రభుత్వానికి ఈ విషయం చేరవేయాలని హర్ష్ శ్రింగ్లాను కోరినట్లు సమాచారం. హిందూత్వ రాజకీయాలనుంచే కొత్త పౌరసత్వ సవరణ చట్టం పుట్టుకొచ్చిందని చెప్పేందుకు కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది UNSCIRF.ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ 2005లో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసింది. ఈ శతాబ్దం హిందూత్వ శతాబ్దమని భారత్‌లో ఇతర మతస్తులకు చోటు లేకుండా చేస్తామని యోగీ ఆదిత్యనాథ్ 2005లో చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి ప్రస్తావించింది.

మొత్తం డాక్యుమెంట్లలో వివాదాస్పద సీఏఏ గురించి ప్రస్తావించిన యూఎన్... పౌరసత్వ సవరణ చట్టంతో భారత్‌లో నివసిస్తున్న ముస్లిం సామాజిక వర్గం వారికి నష్టంతో పాటు కష్టంగానే మారుతుందనే ఆందోళన వ్యక్తం చేసింది.

English summary
The new citizenship law of India will adversely impact the Muslim community of the country, a legislative report in the United States has declared
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X