వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Watch: మార్స్‌పై అడుగుపెట్టిన పర్సెవరెన్స్ రోవర్: నాసా రిలీజ్ చేసిన అద్భుత ఫొటోలు, వీడియోలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంగారకుడిపై అమెరికా పంపిన 'పర్సెవరెన్స్' రోవర్ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా సోమవారం విడుదల చేసింది. అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది తెలుసుకునేందుకు ఈ రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే.

అరుణ గ్రహంపై ల్యాండైన పర్సెవరెన్స్ రోవర్..

అరుణ గ్రహంపై ల్యాండైన పర్సెవరెన్స్ రోవర్..

కాగా, తాజాగా విడుదల చేసిన మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్' రోవర్.. అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్ అయిన క్షణాలు రికార్డయ్యాయి. రోవర్ ల్యాండవుతుండగా అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ కిందికి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

అంగారక గ్రహంపై నిజంగా అద్భుత వీడియోలు

అంగారక గ్రహంపై ల్యాండింగ్ వంటి సంఘటనను మేము క్యాప్చర్ చేయడం ఇదే మొదటిసారి అని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ అన్నారు.
'ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు' అని వాట్కిన్స్ చెప్పారు. తాము వారమంతా వాటిని ఎక్కువగా చూశామని తెలిపారు.

ఊహించినవిధంగానే రోవర్ పని..

నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ మాట్లాడుతూ.. పర్సెవరెన్స్ వీడియోలో "ప్రెజర్ సూట్ వేయకుండా మీరు అంగారక గ్రహంపైకి దిగడానికి దగ్గరి అవకాశాలు ఉన్నాయి." అని తెలిపారు. ఇప్పటివరకు ఊహించిన విధంగా రోవర్ పనిచేస్తున్నట్లు పర్సవరెన్స్ ఉపరితల మిషన్ మేనేజర్ జెస్సికా శామ్యూల్స్ తెలిపారు. 'పర్సెవరెన్స్ రోవర్ హెల్దీగా ఉందని నివేదించడానికి నేను సంతోషంగా ఉన్నాను. మేము వాటిని ప్లాన్ చేస్తున్నందున కార్యకలాపాలు కొనసాగుతున్నాము' అని శామ్యూల్స్ చెప్పారు.

రోవర్‌లో 25 కెమెరాలు, రెండు మైక్రో ఫోన్లు..

పర్సెవరెన్స్ రోవర్ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన విషయం తెలిసిందే. ఈ రోవర్ రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రో ఫోన్లను ఇంజినీర్లు అమర్చారు. రోవర్ ల్యాండింగ్ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజినీర్లు స్విచ్ ఆన్ చేశారు. రానున్న కొద్ది రోజుల్లోనే రోవర్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్స్ విడుదల చేస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజాగా ఈ వీడియోలు విడుదల చేసింది. ఇప్పటికే పర్సెవర్ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించిన ఫొటోలు తీసి పంపిన విషయం తెలిసిందే. తాజాగా, కూడా రోవర్ దిగిన ఫొటోలను పంపింది.

English summary
The US space agency NASA on Monday released the first audio from Mars, a faint crackling recording of wind captured by the Perseverance rover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X