• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు, నిధులు.. మయన్మార్ వినాశనానికి డ్రాగన్ కుట్ర.. ఆర్మీ చీఫ్ సంచలనం..

|

సరిహద్దులో హింసాత్మక ఘర్షణల తర్వాత చైనా పీచమణిచే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలతో డ్రాగన్ బాధిత మిగతా దేశాలకూ బలం చేకూరింది. చైనా దురాగతాల చిట్టాను విప్పుతూ ఒక్కోదేశం అంతర్జాతీయ సమాజం మందుకు వస్తున్నది. ఆగ్రేయాసియాలో ఒకప్పుడు చైనాతో మంచి సంబంధాలు నెరపి, చివరికి అదే చైనా చేతిలో మోసపోయామంటూ మయన్మార్ ఆవేదన చెందుతోంది. మయన్మార్ ను సర్వనాశనం చేసే కుట్రలో భాగంగా టెర్రరిస్టులకు చైనా భారీగా ఆయుధాలు, నిధులు సమకూర్చిన వైనం ఇప్పుడు బట్టబయలైంది.

గాల్వాన్‌లో చైనాకు భారీ షాక్.. కృత్రిమ నిర్మాణాలపై ప్రకృతి ప్రకోపం.. చర్చల్లో అసాధారణ ప్రతిపాదన..గాల్వాన్‌లో చైనాకు భారీ షాక్.. కృత్రిమ నిర్మాణాలపై ప్రకృతి ప్రకోపం.. చర్చల్లో అసాధారణ ప్రతిపాదన..

ఆర్మీ చీఫ్ సంచలనం..

ఆర్మీ చీఫ్ సంచలనం..

మయన్మార్ లో టెర్రరిస్టు గ్రూపులకు చైనా నుంచి భారీగా నిధులు, ఆయుధాలు అందుతున్నాయనే ఆరోపణలు గతంలోనూ వినిపించినా.. చైనాతో స్నేహం వల్ల మయన్మార్ అధికారులెవరూ దీన్ని నిర్ధారించలేదు. అయితే, ఇప్పుడు దేశం మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొనడం, భారత్ కూడా అండగా నిలుస్తుందనే ధీమా, అంతర్జాతీయంగా చైనాపై వ్యక్తమవుతోన్న వ్యతిరేకత నేపథ్యంలో మయన్మార్ ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ సంచలన విషయాలు వెల్లడించారు. అంతేకాదు, చైనా నుంచి కాపాడాలంటూ అంతర్జాతీ సమాజాన్ని ఆయన వేడుకున్నారు.

షాకింగ్: బీర్ ట్యాంకులో మూత్రం.. 12 ఏళ్లుగా ఓ ఫ్యాక్టరీ ఉద్యోగి నిర్వాకం.. చివరికి ఏమైందంటే..షాకింగ్: బీర్ ట్యాంకులో మూత్రం.. 12 ఏళ్లుగా ఓ ఫ్యాక్టరీ ఉద్యోగి నిర్వాకం.. చివరికి ఏమైందంటే..

అరకాన్, రోహింగ్యా టెర్రరిస్టులకు..

అరకాన్, రోహింగ్యా టెర్రరిస్టులకు..

ఐదు దశాబ్దాల సైనిక పాలన తర్వాత 2016లో అంగ్ సాన్ సూకీ విజయంతో మయన్మార్ ప్రజాస్వామ్య పంథాలోకి మళ్లింది. తొలి నుంచీ మయన్మార్ ఆర్మీ అధినేతలను చెప్పుచేతల్లో ఉంచుకున్న చైనాకు.. కొంత కాలంగా జరుగుతోన్న పరిణామాలు మింగుడు పడటంలేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెర్రరిస్టు గ్రూపులను పెంచిపోషిస్తోంది. ప్రధానంగా అరాకన్ ఆర్మీ(ఏఏ), అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్‌ఎస్ఏ) వంటి టెర్రర్ గ్రూపులకు 95 శాతం ఆయుధాలు చైనా నుంచి లభిస్తున్నాయని, పెద్ద మొత్తంలో నిధులు కూడా అందుతున్నాయని మయన్మార్ ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ పేర్కొన్నారు. ఇటీవలే ఓ రష్యన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయాలను వెల్లడించారు.

పక్కా ఆధారాలు..

పక్కా ఆధారాలు..


‘‘2019లో రోహింగ్యా తీవ్రవాదులు మా సైన్యంపై దాడి చేసిన సమయంలో వాళ్ల దగ్గర అత్యాధునిక చైనా ఆయుధాలున్నట్లు గుర్తించాం. నిషేధిత తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ టెర్రరిస్టు గ్రూపులపై గతేడాది నవంబరులో జరిపిన దాడుల్లోనూ పెద్ద ఎత్తన చైనా ఆయుధాలు పట్టుపడ్డాయి. వాటిలో భూమి నుంచి ఆకాశంలో ఎగిరే టార్గెట్లను పేల్చగలిగే మిస్సైళ్లు కూడా ఉన్నాయి. సరిహద్దు ద్వారా చైనానే రహస్యంగా ఆయుధాలను చేరవేస్తోందనడానికి తగినన్ని ఆధారాలున్నాయి. చైనా బారి నుంచి మా దేశాన్ని కాపాడుకోడానికి అంతర్జాతయ సమాజం సహాయం కావాలి''అని మయన్మార్ ఆర్మీ చీఫ్ అన్నారు.

బలూచిస్తాన్ లోనూ ఇదే తీరు..

బలూచిస్తాన్ లోనూ ఇదే తీరు..


మయన్మార్ టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు, నిధులు అందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడికావడానికి మూడ్రోజుల ముందు పాకిస్తాన్ లో చోటుచేసుకున్న ఓ ఉదంతం కూడా చైనా దురాగతాలకు సాక్ష్యంగా నిలిచింది. సోమవారం(జూన్ 29న) కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్ పై ఉగ్రదాడి జరిపిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)తో చైనాకు నేరుగా సంబంధాలున్నాట్లు తేలింది. చైనా- పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపెక్‌) భద్రత విషయంలో చైనా ప్రభుత్వం పలు ఉగ్రవాద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రఖ్యాత ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదికలో వెల్లడైంది. టెర్రరిస్టు గ్రూపులతో సంప్రదింపులు జరపడం, సీపెక్‌ లో భాగంగా ఉన్న ప్రాజెక్ట్‌లపై దాడులు చేయవద్దని కోరడం, అందుకు ప్రతిఫలంగా టెర్రర్ గ్రూపులకు చైనా భారీగా తాయిలాలు సమర్పించుకోవడం పరిపాటిగా మారినట్లు అనలిస్టులు చెబుతున్నారు.

  చైనా జలాంతర్గాములను Track చేయడానికి Andaman Port ను ఆ దేశ నావికాదళాల కోసం తెరవాలి- Chinoy
  టెర్రరిజంపై ఐరాసలో హైడ్రామా..

  టెర్రరిజంపై ఐరాసలో హైడ్రామా..


  తాను పెంచి పోషించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పేరుతోనే చైనా ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో హైడ్రామా ఆడబోయి బొక్కబోర్లా పడింది. కరాచీ స్టాక్ ఎక్సేంజ్ పై ఉగ్రదాడిని ఖండిస్తూ, పాకిస్తాన్ కు అనుకులంగా భద్రతా మండలిలో చైనా ప్రవేశపెట్టిన తీర్మానం రివర్స్ అయింది. చైనా జిత్తులను పసిగట్టిన ప్రపంచ దేశాలు.. ఉగ్రదాడితోపాటు ఉగ్రవాదానికి సహకరిస్తోన్న పాకిస్తాన్ తీరును కూడా ఖండిస్తూ తీర్మానానికి ఆమోదం చెప్పడంతో చైనా నివ్వెరపోయింది.

  English summary
  Myanmar has accused China of arming terrorist groups like Arakan Army (AA) and Arakan Rohingya Salvation Army (ARSA) and has sought international help to suppress them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X