• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ఒకేచోట నుంచి పదేపదే ఎఫ్‌ఆర్‌బీలు: గ్రహాంతర జీవుల నుంచి సంకేతాలు?

    |

    టోరంటో: సుదూర విశ్వంలో గ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నాయా? అంటే కావొచ్చుననే అంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు. దీంతో ఏలియన్స్ ఉన్నారనే భావనకు మరింత బలం చేకూరుతోంది. నక్షత్ర మండలానికి ఆవలి వైపు నుంచి ఒకే కేంద్రం ద్వారా రేడియో తరంగ విస్ఫోటనం (ఎఫ్ఆర్‌బీ) వెలువడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

    కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సంకేతాలను రెండోసారి గుర్తించారు. బ్రిటిష్ కొలంబియాలో ఏర్పాటు చేసిన కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పరిమెంట్ (సీహెచ్ఐఎంఈ) టెలిస్కోప్ ద్వారా వీటిని గుర్తించారు. కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరం నుంచి వెలువడే శక్తిమంతమైన పేలుళ్లకు సంబంధించిన రేడియో తరంగాలనే ఎఫ్ఆర్‌బీలుగా వ్యవహరిస్తారు.

    ఇవి గ్రహమంత పరిమాణంలో ఉన్న ఏలియన్ ట్రాన్స్‌మిటర్స్ నుంచి వెలువడుతుండవచ్చని హార్వర్డ్ స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఫ్రొఫెసర్ ఎవీ లియోబ్, మనస్వి లింగం 2017లో చెప్పారు. ఇప్పటి వరకు 60 ఎఫ్‌ఆర్‌బీ సంకేతాలను గుర్తించారు. 2015లో తొలిసారిగా ఒకే కేంద్రం ద్వారా వెలువడుతున్న రిపీటింగ్ ఎఫ్‌ఆర్‌బీని గుర్తించారు. 2018 గుర్తించిన 13 ఎఫ్‌ఆర్‌బీలలో ఈ రిపీటింగ్ ఎఫ్‌ఆర్‌బీ ఒకటి.

    Mysterious fast radio bursts discovered from deep space could be aliens

    1.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని ఓ కేంద్రం నుంచి 6సార్లు సంకేతాలు వెలువడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకు ఒకే రిపిటీంగ్ ఎఫ్‌ఆర్‌బీని కనుగొన్నారు. రెండోది గుర్తించడం ద్వారా ఇలాంటివి మరిన్ని ఉండే అవకాశముందని తెలుస్తోందని ఇన్‌గ్రిండ్ స్టెయిర్స్ అనే సైంటిస్ట్ అన్నారు.

    తాజాగా గుర్తించిన 13 ఎఫ్‌ఆర్‌బీల్లో వికిరణ సంకేతాలు కనిపిస్తున్నాయని, రేడియో తరంగాలు వెలువడుతున్న ప్రాంత పరిసరాల గురించి తెలుసుకునేందుకు వీటి ద్వారా వీలవుతుందని అంటున్నారు. సూపర్‌నోవా అవశేషం లేదా ఏదైనా గెలాక్సీలోని సెంట్రల్ బ్లాక్ హోల్ సమీపంలో ఈ రేడియో సంకేతాల కేంద్రం ఉండొచ్చని అంటున్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Scientists have detected the second repeating fast radio burst (FRB) ever recorded, a discovery that may help determine the origin of these mysterious signals which have been linked with advanced alien technology in the past.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more