వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుపెన్నడూ చూడని భారీ వింత ఆకారం: ఏమై ఉంటుంది?

మునుపెన్నడూ చూడని ఓ భారీ భయంకర ఆకారం మురవాయి బీచ్‌కు కొట్టుకువచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూజిలాండ్: చనిపోయిన తిమింగలమా?.. చర్మం తీసి వదిలేసిన సొర చేపా? లేక ఏళ్లుగా సముద్రపు నీటిలో నాని ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ చెట్టు అయి ఉండవచ్చా?.. న్యూజిలాండ్ లోని మురవాయి తీరానికి కొట్టుకువచ్చిన ఓ వింత ఆకారాన్ని చూసి అక్కడి జనం అనుకుంటున్న మాటలివి.

మునుపెన్నడూ చూడని ఓ భారీ ఆకారం మురవాయి బీచ్‌కు కొట్టుకువచ్చింది. దగ్గరికెళ్లి పరిశీలిద్దామంటే.. ఒక్కసారిగా అది మీద పడి దాడి చేస్తే ఎలా? అన్న భయంతో ఎవరూ దగ్గరికెళ్లడానికి కూడా ధైర్యం చేయడం లేదు. బీచ్‌కు వెళ్లినవారు ఆ భారీ ఆకారాన్ని ఫోటోలు తీసి
సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం న్యూజిలాండ్ అంతటా ఈ భారీ ఆకారం గురించే చర్చ జరుగుతోంది.

Mysterious 'Muriwai monster' washes up on New Zealand beach

అయితే కొంతమంది పరిశీలకులు మాత్రం ఇది ఓ చెట్టు మొద్దుగా చెబుతున్నారు. ఏళ్లుగా సముద్రపు నీటిలో నానిపోయిన దీనిపై సముద్ర జలచరాలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి జలచరాలు సముద్రంలో పయనించే పడవల అంచున కూడా చేరుతాయనేది పరిశోధకుల వాదన. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను తప్పుబడుతున్నారు.

మరికొంతమంది ఇంకో అడుగు ముందుకేసి వేరే గ్రహం నుంచి వచ్చిన ఆకారమై ఉండవచ్చునని అభిప్రాయపడుతుండటం గమనార్హం. ఇప్పటికైతే ఈ ఆకారం ఏదైనా జంతువుకు సంబంధించిందా? లేక ఏదైనా శిథిల వస్తువా? అన్నదానిపై స్పష్టత రాలేదు.

English summary
"Just curious to know if anyone knows what this is??! Washed up on Muriwai Beach," Doubleday posted on Facebook with photos of the oddity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X