వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీబీసీకి షాకిచ్చిన ఉత్తర కొరియా, కిమ్ ప్రవర్తనపై ట్రంప్ ఆగ్రహం

బీబీసీ ఛానల్‍‌కు ఉత్తర కొరియా షాకిచ్చింది. బీబీసీ కొత్త కొరియన్ సర్వీసులను అడ్డుకుంది. కొత్త సేవలు ప్రారంభించిన రోజునే అడ్డుకుంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బీబీసీ ఛానల్‍‌కు ఉత్తర కొరియా షాకిచ్చింది. బీబీసీ కొత్త కొరియన్ సర్వీసులను అడ్డుకుంది. కొత్త సేవలు ప్రారంభించిన రోజునే అడ్డుకుంది.

యుద్ధానికి అంతా సిద్ధం, అదే జరిగితే: ట్రంప్, తగ్గని ఉత్తర కొరియాయుద్ధానికి అంతా సిద్ధం, అదే జరిగితే: ట్రంప్, తగ్గని ఉత్తర కొరియా

బీబీసీకి షాక్

బీబీసీకి షాక్

బీబీసీ కొత్తగా కొరియన్ సర్వీసులను మంగళవారం నాడు ప్రారంభించింది. వార్తలు, స్పోర్ట్స్, బిజినెస్, కల్చర్ తదితరాలను కొరియన్ భాష వారికి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొరియా మాట్లాడే వారికి దీనిని తీసుకు వచ్చింది.

ఉత్తర కొరియాలో ఆంక్షలు

ఉత్తర కొరియాలో ఆంక్షలు

అయితే ఉత్తర కొరియాలో పలు రకాల ఆంక్షలు ఉన్నాయి. ఫారెన్ రేడియో స్టేషన్స్ వినడం ఉత్తర కొరియాలో చట్ట విరుద్దం. దీంతో బీబీసీ కొత్త ఛానల్‌ను ప్రారంభించిన సాయంత్రమే ఉత్తర కొరియా షాకిచ్చింది.

ట్రంప్ అల్టిమేటం

ట్రంప్ అల్టిమేటం

ఇదిలా ఉండగా, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తున్న ఉత్తరకొరియాపై సైనిక చర్యకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. తమ దేశ సరిహద్దుల సమీపంలో ఎగిరే అమెరికా బాంబర్లను కూడా కూల్చేస్తామని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి రియాంగ్‌ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు.

ఉత్తర కొరియాను అణురహిత దేశంగా మార్చుదాం

ఉత్తర కొరియాను అణురహిత దేశంగా మార్చుదాం

బాధ్యతగల దేశాలన్నీ చేతులు కలిపి ఉత్తర కొరియాను అణురహితంగా మార్చాలని ట్రంప్ అన్నారు. రెండో పరిష్కార మార్గంగా సైనిక చర్యకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ఆ మార్గాన్ని ఎంచుకోవాలని అనుకోవట్లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మార్గాన్ని ఎంచుకుంటామని, అప్పుడు దాన్ని పూర్తి చేసే వరకు వెనుదిరగమన్నారు.

కిమ్ ప్రవర్తన బాగా లేదని ట్రంప్

కిమ్ ప్రవర్తన బాగా లేదని ట్రంప్

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్‌ ప్రవర్తన బాగోలేదని ట్రంప్‌ మండిపడ్డారు. ఆ దేశం చేపట్టే క్షిపణి ప్రయోగాల కారణంగా ఊహించని స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన చైనాను ట్రంప్‌ అభినందించారు. జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
North Korea started “aggressively” jamming the BBC’s new Korean language service on the same day it began, according to a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X