వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kim Jong Un:అమెరికాకు ఆమెనే కరెక్ట్.. కీలక అధికారాలు సోదరికి బదిలీ చేయనున్న కిమ్..?

|
Google Oneindia TeluguNews

ఉత్తరకొరియాలో అధికార మార్పిడి జరగబోతోందా..? నియంత కిమ్ జాంగ్ ఉన్ మెజార్టీ అధికారాలను మరొకరికి బదిలీ చేయనున్నారా..? అయితే ఎవరిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు..? అధికారం మరొకరికి ఎందుకు ఇవ్వాలని భావిస్తున్నారు..? ఉత్తరకొరియా పొలిటికల్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Recommended Video

North Korea : ఉత్తరకొరియా బాధ్యతలు సోదరి కిమ్ యో జాంగ్ కి అప్పగించనున్న కిమ్! || Oneindia Telugu
సోదరికి కీలక బాధ్యతలు

సోదరికి కీలక బాధ్యతలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్ పాలనాపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ కిమ్ తిరిగిరావడంతో ఆమె పేరు మళ్లీ మరుగున పడింది. అయితే తాజాగా మరోసారి కిమ్ జాంగ్ ఉన్ సోదరి పేరు తెరపైకొచ్చింది. అయితే ఈ సారి అధ్యక్షుడు కిమ్ తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కిమ్ యో జాంగ్‌కు పరిపాలన విభాగంలో కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

డీఫాక్టో ఇన్ కమాండ్‌గా కిమ్ సోదరి

డీఫాక్టో ఇన్ కమాండ్‌గా కిమ్ సోదరి

దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ అతని తర్వాత ఉత్తరకొరియాకు రెండో అధ్యక్షురాలిగా చలామణి కానున్నారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వియాత్నాంలో జరిగిన భేటీ సందర్భంగా కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ చాలా యాక్టివ్‌గా కనిపించారు. మొత్తానికి కిమ్ యో జాంగ్ డీఫాక్టో ఇన్ కమాండ్‌గా వ్యవహరించనున్నట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక తాజాగా ఉత్తరకొరియా ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముందుగా వరదలు ఆదేశాన్ని ముంచెత్తగా దాన్నుంచి కోలుకోకముందే కరోనావైరస్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిదిమేసింది. కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోందన్న వార్త రాగానే ముందుగా తన సరిహద్దులను మూసివేసిన దేశంగా ఉత్తరకొరియా గుర్తింపు పొందింది.

గతంలోనే తెరపైకొచ్చిన కిమ్ సోదరి పేరు

గతంలోనే తెరపైకొచ్చిన కిమ్ సోదరి పేరు

ఇదిలా ఉంటే తనపై కాస్త ఒత్తిడి తగ్గించుకునేందుకు మాత్రమే కిమ్ జాంగ్ ఉన్ కొన్ని బాధ్యతలను తన సోదరికి బదిలీ చేయాలనుకుంటున్నారని అయితే ఇది తన ఆరోగ్యంతో ఎలాంటి సంబంధం లేదని దక్షిణకొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే కిమ్ జాంగ్ ఉన్న ఈ ఏడాది మొదట్లో అనారోగ్యం కారణంగా ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. దీంతో అంతా కిమ్ జాంగ్ ఉన్ సోదరే తదుపరి అధ్యక్ష బాధ్యతలు చేపడతారని భావించారు. అంతేకాదు ఉత్తర కొరియా మీడియా ఆమెపై ఫోకస్ పెడుతున్న తీరు చూస్తే ఆమెను అధ్యక్షరాలిగా మార్చేందుకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అమెరికాతో , దక్షిణ కొరియాతో చర్చల సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు ఆకట్టుకుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి ఇప్పటి వరకు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోని అగ్రదేశాలను వణికించారు. అయితే ఇక ఆయన సోదరి కిమ్ యో జాంగ్ బాధ్యతలు చేపడితే ఆమె కిమ్‌ కంటే మరింత డేంజర్‌‌గా వ్యవహరిస్తారని ఇటు ఉత్తరకొరియాతో పాటు దక్షిణ కొరియా కూడా భావిస్తోంది.

English summary
Kim Jong Un has reportedly given his sister, Kim Yo Jong, partial authority to oversee "general state affairs" in order to ease the North Korean leader's workload, according to South Korean intelligence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X