వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధమే అంటే! మేం సిద్ధమే: అమెరికాకు తేల్చేసిన ఉ.కొరియా, ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un

సియోల్‌/ప్యాంగ్యాంగ్: తాము యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమేనని ఉత్తరకొరియా మరోసారి తేల్చి చెప్పింది. దక్షిణ కొరియాతో కలసి అమెరికా సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించడంపై ఉత్తర కొరియా మండిపడింది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని అయితే ఈ చర్యలతో యుద్ధానికి దిగే పరిస్థితి నెలకొందని ఆ దేశ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ఉత్తరకొరియా ముప్పు: భారత సాయం కోరిన అమెరికా ఉత్తరకొరియా ముప్పు: భారత సాయం కోరిన అమెరికా

యుద్ధమొస్తే! ఉ.కొరియా సర్వనాశనమే, కిమ్‌ను బతకనివ్వం: అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్యుద్ధమొస్తే! ఉ.కొరియా సర్వనాశనమే, కిమ్‌ను బతకనివ్వం: అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికాపై ఉ.కొరియా.. క్షిపణి ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అమెరికాపై ఉ.కొరియా.. క్షిపణి ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

కాగా, ఇటీవలే ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత అమెరికా భారీ సంఖ్యతో స్టెల్త్‌ యుద్దవిమానాలను దక్షిణ కొరియాకు పంపింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రతినిధి పేర్కొన్నారు.

యుద్ధమేఘాలు

యుద్ధమేఘాలు

ప్రపంచదేశాలు అభ్యర్థిస్తున్నప్పటికీ ఉత్తర కొరియా అణుపరీక్షలు, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా సిద్ధమన్నట్లు వ్యవహరిస్తుండటంతో కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి.

కాల్చిపారేస్తామంటూ.. పోటాపోటీగా అమెరికా, ఉ. కొరియా

కాల్చిపారేస్తామంటూ.. పోటాపోటీగా అమెరికా, ఉ. కొరియా

సెప్టెంబరులో అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానాలు బీ-1బీ బాంబర్లు పెద్ద సంఖ్యలో దక్షిణ కొరియాకు చేరుకున్నాయి. దీనిపై ఆగ్రహించిన ఉత్తర కొరియా తమ గగనతలంలో అమెరికా, దక్షిణ కొరియా యుద్ధవిమానాలు ప్రవేశిస్తే కాల్చివేస్తామని హెచ్చరించింది.

అమెరికా అప్రమత్తం

అమెరికా అప్రమత్తం

ఉత్తర కొరియా ప్రయోగాలతో అప్రమత్తమైన అమెరికా ఇప్పటికే దక్షిణ కొరియాలోని తన స్థావరాల్లో మిలటరీని, ఆయుధాలను సిద్ధం చేసింది. తమకు వ్యతిరేకంగా విన్యాసాలు చేపట్టడాన్ని ఉత్తర కొరియా ఖండించింది.

యుద్ధాన్ని కోరువడం లేదంటూనే

యుద్ధాన్ని కోరువడం లేదంటూనే

ఉత్తర కొరియా, అమెరికాలు రెండూ యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూనే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే యుద్ధం జరిగితే అందుకు కారణం నువ్వంటే నువ్వని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నిర్వహిస్తే అందుకు జవాబుగా అమెరికా యుద్ధవిమానాలను పంపించడం పరిపాటిగా మారడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

చైనా శాంతి మంత్రం

చైనా శాంతి మంత్రం

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఉత్తర కొరియాకు పెద్దదిక్కు చైనా కావడం గమనార్హం. రెండు దేశాలు రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికింది. యుద్ధం వస్తే అందరికి నష్టంగా మారుతుందని చెబుతోంది.. ఉత్తర కొరియా, అమెరికాలు సంయమనం పాటించాలని హితవు పలికింది.

English summary
North Korea on Thursday said nuclear war on the peninsula is an “established fact” and blamed military exercises between United States and South Korea forces and “violent war remarks” by high-ranking US officials for provoking the already tense situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X