• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవును.. క్షిపణి పరీక్ష చేశాం.. అయితే ఏంటి? : ఉత్తర కొరియా ధిక్కారం

By Ramesh Babu
|

ప్యాంగ్ యాంగ్: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగలిగే బాలిస్టిక్ మిస్సైల్ ను ఆదివారం తాము విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ పరీక్షను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు కొరియన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వెల్లడించింది.

ఈ క్షిపణి తూర్పు దిశగా జపాన్ సముద్ర తీరం వైపు 500 కిలోమీటర్లు ప్రయాణించిందని అమెరికా, దక్షిణ కొరియా తెలిపాయి. గరిష్ఠంగా 550 కిలోమీటర్ల ఎత్తుకు ఈ మిస్సైల్ చేరినట్లు దక్షిణ కొరియా మిలిటరీ వర్గాలు వెల్లడించాయి.

పొరపాటున జపాన్ మీద పడితే...

పొరపాటున జపాన్ మీద పడితే...

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7.55 గంటలకు పాంగ్ యోన్ ఎయిర్ బేస్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి.. జపాన్ లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉండడంతో తక్కువ దూరానికే ప్రయోగించారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అందుకే అంతటి శక్తి...

అందుకే అంతటి శక్తి...

ఈ క్షిపణి ప్రయోగ పరీక్షకు ఉపయోగించిన రాకెట్ లో ఘన ఇంధన ఇంజిన్ వాడారని, అందువల్ల క్షిపణికి అధిక సామర్థ్యం, అధిక పరిధి వస్తాయని, తాజా క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేశారని కేసీఎన్ఏ పేర్కొంది.

ట్రంప్ స్పందన కోసమే...

ట్రంప్ స్పందన కోసమే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడటానికే ఉత్తర కొరియా ఈ సాయుధ కవ్వింపు చర్యకు పాల్పడిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ ఆరోపించింది. ఉత్తర కొరియా చేసిన ఈ పరీక్షను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.

తక్షణమే భద్రతామండలి సమావేశం...

తక్షణమే భద్రతామండలి సమావేశం...

దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా డిమాండ్ చేశాయి. న్యూక్లియర్ వార్ హెడ్ ను మోసుకెళ్లగలిగే వ్యూహాత్మక ఆయుధం ఈ పుగుక్ సాంగ్-2 క్షిపణి అని కొరియన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొంది.

ఉద్రిక్తతలు మరింత పెంచొద్దు: నాటో

ఉద్రిక్తతలు మరింత పెంచొద్దు: నాటో

మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను నాటో కూడా తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతలను ఇంకా పెంచవద్దని, అంతర్జాతీయ సమాజంతో అర్థవంతమైన చర్చలు జరపాలని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్ బర్గ్ ఉత్తర కొరియాకు సూచించారు.

జపాన్ వెనుక మేమున్నాం: ట్రంప్

జపాన్ వెనుక మేమున్నాం: ట్రంప్

ఉత్తర కొరియా పదే పదే ఇలా రెచ్చగొట్టేలా వ్యవహరించడం సహించరానిదని యూరోపియన్ యూనియన్ విమర్శించింది. ఇప్పటికే తాము వంద శాతం జపాన్ వెనుకే ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఉత్తర కొరియా మిత్రదేశమైన చైనా మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea claimed that it successfully test-fired a surface-to-surface “medium long-range ballistic missile” capable of carrying a nuclear warhead on Sunday, the North’s state-run Korean Central News Agency (KCNA) reported on Monday. North Korean leader Kim Jong Un supervised the test launch of the ballistic missile named “Pukguksong-2” and described it as a “Korean-style new type strategic weapon system.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more