వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మస్ట్ రీడ్ : కండోమ్ చిరిగింది.. కాపురంలో చిచ్చు పెట్టింది

|
Google Oneindia TeluguNews

Recommended Video

కండోమ్ చిరిగింది.. కాపురంలో చిచ్చు పెట్టింది

నైరోబీలో ఓ వ్యక్తి ఓ కండోమ్ కంపెనీపై పరువునష్టదావా వేశాడు. చిన్న కండోమ్ తన జీవితాన్ని బుగ్గిపాలు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు. ఇంతకీ ఈ కండోమ్ కహానీ ఏమిటో తెలియాలంటే ఇది చదవండి.

నైరోబీలో నివసిస్తున్న న్యాక్వెబ్ కండోమ్ తయారు చేసిన బీటా హెల్త్ కేర్ సంస్థపై పరువునష్ట దావా వేశాడు. తన భార్య ఇంట్లో లేని సమయంలో న్యాక్వెబ్ మరో స్త్రీతో లైంగికంగా కలిశాడు. సెక్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు కానీ...ఇక్కడే చిన్న పొరపాటు జరిగి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తాను మరో స్త్రీతో కలిసినప్పుడు వినియోగించిన కండోమ్ చిరిగిపోయింది. అయితే దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చిన్నపాటి ఇన్ఫెక్షన్ రావడం గమనించాడు. అప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత తన భార్యతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. ఇక్కడే స్టోరీ టర్న్ అయ్యింది.

Nairobi man sues condom company, here is why?

తన భార్యతో కలిశాక కొద్ది రోజులకు ఆమెకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో పడ్డాడు న్యాక్వెబ్. వెంటనే తను ఓ డాక్టరును సంప్రదించాడు. డాక్టర్ చెప్పిన మాటలకు న్యాక్వెబ్ గుండె జారి కడుపులోకి పడినట్లయ్యింది. తనకు లైంగిక సంబంధిత వ్యాధి సోకిందని నిర్ధారించారు. అదే వ్యాధి తన భార్యకు కూడా సోకి ఉంటుందని తెలుసుకున్నాడు. ఇంకేముంది... పరాయి స్త్రీ దగ్గరకు పరుగులు తీసి ఆమెను ఆరా తీయగా అప్పటికే ఆమెకు లైంగిక సంబంధిత వ్యాధి ఉన్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. అయితే ఆ మహిళతో కలిసినప్పుడు కండోమ్ వాడినప్పటికీ అది మధ్యలోనే చిరిగి పోవడంతో ఆ మహిళకు ఉన్న ఇన్‌ఫెక్షన్ న్యాక్వెబ్‌కు సోకింది.

జరిగిన ఘటనపై న్యాక్వెబ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తను కొన్న కండోమ్ కంపెనీపై పరువునష్ట దావా వేశాడు. ఇది తెలిసిన తన ఆఫీస్ యాజమాన్యం న్యాక్వెబ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. తన భార్య విడాకులు ఇచ్చేసింది. మద్యానికి బానిసయ్యాడు. జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు తన ఆరోగ్యం కుదుట పడేందుకు, తన చికిత్సకు డబ్బులు కావాలని అది సదరు కండోమ్ కంపెనీయే భరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

English summary
A Nairobi man has gone to court to protest the marketing, sale and distribution of a specific type of condoms in the country.Williamson Nyakweba Omworo has sued Beta Healthcare, Kenya Bureau of Standards (KeBS) and the Kenya Revenue Authority (KRA) over the sale of Zoom condoms which he claims to be substandard.He alleged that he used the condom on various women and contracted sexually transmitted infections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X