వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేం సాంప్రదాయం?: స్కూల్లో విద్యార్థినులతో అర్ధనగ్నంగా నృత్యాలు

|
Google Oneindia TeluguNews

జోహెన్స్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలోని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థినులతో నగ్ననృత్యాలు చేయించడం ఇప్పుడు ఆ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ కార్యక్రమం సందర్భంగా చేసిన ఈ నృత్యాలకు సంబంధించిన వీడియోలు మీడియాతోపాటు సోషల్ మీడియాలు కూడా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో మెజార్టీ ప్రజలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇలాంటి వాటిని తాము సహించబోమని సంబంధిత మంత్రి స్పష్టం చేశారు.

అర్ధనగ్నంగా విద్యార్థులతో నృత్యాలు

అర్ధనగ్నంగా విద్యార్థులతో నృత్యాలు

వివరాల్లోకి వెళితే... కేప్‌ ప్రొవిన్స్‌లో ఉన్న ఓ స్కూల్‌లో వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. చోయిర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు.. సాంప్రదాయిక ఖ్సోసా నృత్యంలో భాగంగా టాప్‌ లెస్‌గా మారి నృత్యాలు చేశారు. డప్పుల చప్పుళ్లకు లయబద్ధంగా నగ్న దేహాన్ని ఆడించటం ఈ నృత్యం ప్రత్యేకత.

స్కూల్ యాజమాన్యం ఇలా..

స్కూల్ యాజమాన్యం ఇలా..

కాగా, ఆ వీడియోలు మీడియాలో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. దీనిపై తల్లిదండ్రులుసహా ప్రజలు భగ్గుమన్నారు. అయితే వారేం పూర్తి నగ్నంగా దృశ్యాలు చేయలేదని, సాంప్రదాయ నృత్యానికి అనుగుణంగా దుస్తులు ధరించారని స్కూల్‌ యాజమాన్యం చెప్పడం గమనార్హం.

కొన్ని ప్రాంతాల్లో మాత్రమే..

కొన్ని ప్రాంతాల్లో మాత్రమే..

ఘటనపై విద్యాశాఖ మంత్రి అంగీ మోట్షేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపులేనని ఆమె అన్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఆమె నివేదిక ఆధారంగా స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే, అర్థనగ్న దృశ్యాలు దక్షిణాఫ్రికా చరిత్ర, సంస్కృతిల్లో భాగంగా గతంలో ఉండేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో ఇలా.. తేల్చి చెప్పిన ప్రభుత్వం

గతంలో ఇలా.. తేల్చి చెప్పిన ప్రభుత్వం

రీడ్‌ నృత్యాల పేరిట అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలు రాజ వంశస్థుల ముందు నృత్యాలు చేయటం ఓ ఆనవాయితీగా ఉండేది. కానీ, తర్వాత రాజకిక వ్యవస్థపోయి ప్రజాపరిపాలన రావడంతో ఆ సాంప్రదాయాలు కనుమరుగు అయిపోయాయి. అయితే, ఈ మధ్య కొన్ని జాతుల ప్రజలు తిరిగి ఆచరణలో తెచ్చేందుకు పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేమని, చట్టబద్ధం చేయటం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

English summary
Basic Education Minister Angie Motshekga has strongly condemned the naked dancing of teenage school girls on stage in the Eastern Cape leg of the ABC Motsepe SASCE, that took place this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X